|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నారి నారి నడుమ మురారి: సస్పెన్స్ వీడింది! శర్వానంద్ సినిమాకు ఊహించని ట్విస్ట్, హీరో శ్రీ విష్ణు ఎంట్రీతో రచ్చ!

Published: 04-01-2026, 6:00 AM
నారి నారి నడుమ మురారి: సస్పెన్స్ వీడింది! శర్వానంద్ సినిమాకు ఊహించని ట్విస్ట్, హీరో శ్రీ విష్ణు ఎంట్రీతో రచ్చ!
  • ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
  • శ్రీ విష్ణు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు విడుదలైన వీడియో ద్వారా వెల్లడైంది.
  • శర్వానంద్, సంయుక్తం మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించారు.
  • ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 14 సాయంత్రం నుంచి ప్రసారం కానున్నాయి.

శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికి సిద్ధమవుతోంది. ప్రమోషన్లలో భాగంగా విడుదలైన వీడియో భారీ హైప్ సృష్టించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలియడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 14 నుంచి ప్రీమియర్ కానుంది.

శ్రీ విష్ణు సర్‌ప్రైజ్ ఎంట్రీతో పెరిగిన అంచనాలు

Nari Nari Naduma Murari: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల జాబితాలలో శర్వానంద్(Sharwanand) నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari ) సినిమా కూడా ఒకటి. ఇన్ని రోజులు ప్రమోషన్లకు కాస్త దూరంగా ఉన్న చిత్ర బృందం ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేయడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. శర్వానంద్, సంయుక్తం మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 15వ తేదీ ప్రసారం కాగా జనవరి 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేయగా ఈ వీడియో ద్వారా మరొక నటుడు శ్రీ విష్ణు(Sree Vishnu) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశారు. ఈ వీడియోని విడుదల చేస్తూ ప్రత్యేక ప్రకటన, నవ్వుల పండుగకు సిద్ధంగా ఉండండి అంటూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది .ఇలా ఈ సినిమాలో శ్రీ విష్ణు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలియడంతో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాకు అబ్బరాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందని తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ రిలీజ్ అంటూ పలువురు భావిస్తున్నారు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ గతంలో శతమానం భవతి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి సక్సెస్ అందుకున్నారు.

A special addition, a special announcement! 📢

శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్: సక్సెస్ రిపీట్ అవుతుందా?

The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️‍🔥

Get ready for laughter overload! 😂🔥

Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿

Charming Star @ImSharwanand … pic.twitter.com/XrmD6fRh5b

పోటీలో స్టార్ హీరోలతో ‘నారి నారి నడుమ మురారి’

— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ప్రభాస్ ,చిరంజీవి, రవితేజ, వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇలా తెలుగు హీరోలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో స్టార్ హీరోలు పోటీకి దిగినప్పటికీ శర్వానంద్ వెనకడుగు వేయకుండా తన సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు . ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టత్మకంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ గతంలో మాదిరి తన మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారా? లేదా మరోసారి నిరాశ ఎదుర్కొంటారా? అనేది తెలియాల్సి ఉంది.

శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’కి శ్రీ విష్ణు సర్‌ప్రైజ్ ఎంట్రీ అదనపు బూస్ట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల చిత్రాలతో పోటీపడుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.