|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా కోడలికి తప్పని వేధింపులు! పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి! అసలేం జరిగింది?

Published: 10-03-2026, 2:05 AM
మెగా కోడలికి తప్పని వేధింపులు! పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి! అసలేం జరిగింది?
  • లావణ్య త్రిపాఠి తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  • సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి IP అడ్రస్ వివరాలు సేకరిస్తున్నారు.

టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లావణ్య త్రిపాఠి ఫిర్యాదుకు కారణం ఏమిటి?

Lavanya Complaint: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. తన వ్యక్తిగత గౌరవానికి కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మీడియా ముఖంగా పలు సార్లు హెచ్చరించారు. ఇప్పటికీ ఆగకపోవడంతో ఇన్ స్టాగ్రామ్ లో వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆన్ లైన్ వేధింపులకు అంతు పంతూ లేకుండా పోతుంది. మెగా కోడలికి కూడా ఇలాంటి వేధింపులు తప్పడం లేదు.

Read also- Legal Drama OTT: కడుపు తెచ్చుకున్నందుకు కేసు… ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్ మావా

పోలీసుల విచారణ ఎలా సాగుతోంది?

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి కొన్ని అజ్ఞాత ఖాతాల నుంచి తీవ్రమైన దూషణలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘పర్పుల్ క్రెయాన్00’ (purplecrayon00) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also- Spirit Movie Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లిరిసిస్ట్..

సైబర్ నేరగాళ్లకు పోలీసుల హెచ్చరిక

లావణ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకర సమాచారాన్ని ప్రచురించడం. ఒక మహిళను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా వేధించడం. ఒక మహిళా గౌరవానికి భంగం కలిగించేలా పదాలు ఉపయోగించడం లేదా చేష్టలు చేయడం. వంటి పలు కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా IP అడ్రస్ లాగ్ వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడిని గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. టెక్నాలజీ సాయంతో ఇతరులను దూషించి తప్పించుకోవచ్చని భావించే వారికి ఈ కేసు ఒక గుణపాఠం కానుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇతరులను వేధించేవారికి ఈ కేసు ఒక గుణపాఠం అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.