
వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం నుంచి ‘చిత్తూరు పిల్లా’ అనే పెళ్లి పాట విడుదలైంది. ఈ పాట వనమాలి లిరిక్స్, మిక్కీ జే మేయర్ సంగీతంతో అలరిస్తోంది.
Key Points
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత తొలి సినిమా ‘సతీ లీలావతి’
‘చిత్తూరు పిల్లా’ అనే పెళ్లి పాట విడుదలైంది
వనమాలి లిరిక్స్, నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు గానం
మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు
‘సతీ లీలావతి’ నుండి పెళ్లి పాట
వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి . ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు . ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ లో నాగ మోహన్ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ మూవీ నుంచి చిత్తూరు పిల్లా అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు.
చిత్తూరు పిల్లా పాట విడుదల
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్
పెళ్లి వేడుకలో వచ్చే ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది . ఈ పెళ్లిపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ , రితేష్ జి రావు పాడారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ ఈ సంగీతమందిచారు. ఈ చిత్రంలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు .
చిత్తూరు పిల్లా పాటతో సతీ లీలావతి సినిమాపై అంచనాలు పెరిగాయి. లావణ్య త్రిపాఠి అభిమానులు ఈ పాటను ఆస్వాదిస్తున్నారు. సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.


