
📌 Key Points
- అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ మూవీ జూలై 10న విడుదల.
- సినిమా సూపర్ హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
- డిస్ట్రిబ్యూటర్లకు లాభం రావాలంటే రూ.25 కోట్ల షేర్ లభించాలి.
- అఖిల్ కు ఇది కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఉంది.
అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ మూవీ జూలై 10న విడుదల కానుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలంటే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. అఖిల్ కు ఇది కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఉంది.
లెనిన్ మూవీ హిట్ టార్గెట్ ఎంత?
Lenin movie: సీనియర్ స్టార్ హీరో నాగార్జున తనయుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అఖిల్ అక్కినేని (Akhil Akkineni) గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం పాటుపడుతున్న విషయం తెలిసిందే. క్లాసీ లుక్ తో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తాజాగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. వాస్తవానికి గత మూడేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ సినిమాతో తనను తాను నిరూపించుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయారు అయ్యగారు. దీంతో ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో.. సితార ఎంటర్టైన్మెంట్స్ , అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ శుక్రవారం అనగా జూలై 10వ తేదీన నేరుగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వరుస ఫ్లాప్స్ కొడుతున్న అఖిల్ కి ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కీలకం. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ లేదా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేయాలి అనేదానిపై ఆసక్తికర లెక్కలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
అఖిల్ కు ఈ సినిమా ఎందుకు కీలకం?
ఈ సినిమాతో అయ్యగారు హిట్టు కొట్టాలి అంటే.. ఈ సినిమా అన్ని ఖర్చులు కలుపుకొని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ స్టేటస్ అందుకోవాలి అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.అటు షేర్ పరంగా చూసుకుంటే గనుక డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ జోన్ తో పాటు లాభాలు రావడానికి రూ.25 కోట్ల మేరా వరల్డ్ వైడ్ షేర్ లభించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో అఖిల్ తొలిసారి సరికొత్త మాస్ లుక్ లో కనిపిస్తుండడం..అటు ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన ఈ పాజిటివ్ వైబ్ సినిమా విడుదలైన తొలి షో తోనే మంచి టాక్ తెచ్చుకుంది అంటే మాత్రం సుమారుగా ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని.. ట్రేడ్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.మరి గట్టి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ అభిమానులకు ఈ చిత్రం సరైన బ్రేక్ ఇస్తుందని అటు చిత్ర బృందం కూడా ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉన్నట్లు సెన్సార్ బృందం మొదట ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకుందట. అయితే ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి దూరం అవుతారు. తద్వారా ప్రభావం కలెక్షన్ల పై పడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు ఎలాగైనా సరే యూ/ఏ సర్టిఫికెట్ పొందడానికి గట్టి ప్రయత్నాలు చేయగా ఇప్పుడు నిర్మాతల కష్టం ఫలించింది. ఇక పూర్తిగా అనుకున్న కలెక్షన్లు రావాలి అంటే సినిమా తెరపై పడాల్సిందే. మరి రేపు తెల్లవారుజామున థియేటర్లలోకి రాబోతున్న అఖిల్ లెనిన్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ALSO RAED: రష్మికకు ఏమైంది.. ఒంటినిండా కత్తిపోటు గాట్లతో?
మొత్తంమీద, లెనిన్ మూవీ అఖిల్ అక్కినేని కెరీర్ లో కీలకమైన చిత్రంగా నిలవనుంది. రూ.50 కోట్ల గ్రాస్ టార్గెట్ ను అందుకుంటే హిట్ అవడం ఖాయం. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.


