
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ విషయంలో పెద్ద మార్పు జరిగింది. మొదట ఎంపికైన శ్రీలీల స్థానంలో ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామం అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషపరిచింది.
Key Points
అఖిల్ కొత్త సినిమా 'లెనిన్' కిషోర్ కుమార్ అబ్బుర దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ప్రారంభంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది, కానీ ఆమె స్థానంలో ఇప్పుడు కొత్త హీరోయిన్ వచ్చింది.
శ్రీలీల స్థానంలో 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారట.
హీరోయిన్ మార్పుతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు, సినిమా హిట్టవుతుందని ఆశిస్తున్నారు.
అఖిల్ కెరీర్, ‘లెనిన్’ సినిమా ప్రస్థానం
Lenin: అక్కినేని అఖిల్.. పాపం బ్యాడ్ లక్ అంటే ఈ కుర్ర హేరోదు అని చెప్పాలి. అక్కినేని లాంటి స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి ఒక్కటంటే.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్. మొదటి సినిమా అఖిల్ నుంచి మొన్నొచ్చిన ఏజెంట్ వరకు అన్ని డిజాస్టర్సే. (Lenin)మధ్యలో వచ్చిన ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ సినిమా తప్ప. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే, ఏజెంట్ డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో రీసెంట్ గా లెనిన్ సినిమాను మొదలుపెట్టాడు.
Raja Saab Trailer: రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రాజా సాబ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది
శ్రీలీల నిష్క్రమణ, కొత్త హీరోయిన్ ఎంపిక
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను కిషోర్ కుమార్ అబ్బుర తెరకెక్కిస్తున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి అఖిల్ పుట్టినరోజు సందర్బంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఆ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రస్టిక్ లుక్ లో అఖిల్ కూడా చాలా కొత్తగా కనిపించాడు. కాబట్టి, ఈ సినిమాతో అఖిల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని అందరు అనుకున్నారు. కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవడం.
అక్కినేని ఫ్యాన్స్ ఆనందం, సినిమా అంచనాలు
శ్రీలీల నటించిన దాదాపు అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. మధ్యలో వచ్చిన ఒక్క భగవంత్ కేసరి తప్పా అన్ని డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. అందుకే, అఖిల్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకోని చేస్తున్న ఈ సినిమా శ్రీలీలను తీసుకోవడం ఎందుకు చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. ఆ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ ట్రెండ్ చేశారు. మరి ఈ న్యూస్ లెనిన్ మేకర్స్ వరకు చేరిందో తెలియదు కానీ, తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీలను తప్పించారట. ఆమె ప్లేస్ లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నారట. ఈ న్యూస్ బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లెనిన్ విషయానికి వస్తే, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి, ‘లెనిన్’ సినిమా నుండి హీరోయిన్ మార్పు అఖిల్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు రేపింది. భాగ్యశ్రీ రాకతో సినిమా విజయంపై అంచనాలు పెరిగాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌కు విడుదలయ్యే అవకాశం ఉంది.


