|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ కామెడీ..2.5 కోట్ల బ‌డ్జెట్‌, 40 కోట్ల కలెక్ష‌న్స్‌..లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్

Published: 30-09-2025, 11:14 PM
ఇవాళ ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ కామెడీ..2.5 కోట్ల బ‌డ్జెట్‌, 40 కోట్ల కలెక్ష‌న్స్‌..లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్

‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా థియేటర్లలో రూ.40 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవాళ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది.

Key Points

1

'లిటిల్ హార్ట్స్' రొమాంటిక్ కామెడీ చిత్రం ఇవాళ (అక్టోబర్ 1) ఓటీటీలోకి వచ్చింది.

2

ఈ సినిమా రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

4

టీనేజ్ ప్రేమ, బాల్యాన్ని గుర్తుచేసే కథతో ఒక స్వచ్ఛమైన అనుభూతిని అందిస్తుంది.

‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ విడుదల, ప్లాట్‌ఫామ్

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఎక్స్ టెండెడ్ కట్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇవాళ నుంచి మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న సినిమాగా రిలీజైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ విన్ ఓటీటీలోనే సినిమా రిలీజైంది. థియేటర్లో రిలీజైన సినిమాకు మరికొంత భాగం యాడ్ చేసి ఓటీటీ లోకి తీసుకొచ్చారు. ఇందులో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరో హీరోయిన్లు.

బడ్జెట్, కలెక్షన్లు: బాక్సాఫీస్ వద్ద విజయం

లిటిల్ హార్ట్స్ మూవీ థియటర్లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లో విడుదలైంది. మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు కుమ్మేసింది. రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా. లిటిల్ హార్ట్స్ లో మౌళి తనూజ్, శివానీ నగరం, రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య, నిఖిల్ తదితరులు నటించారు. దీనికి సాయి మార్తాండ్ డైరెక్టర్.

చదువులో అంతంతమాత్రంగానే ఉండే అఖిల్ (మౌళి తనూజ్)కు ఎంసెట్ లో ర్యాంకు రాదు. పేమెంట్ సీట్ తో ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటాడు. కానీ ఫాదర్ గోపాలరావు (రాజీవ్ కనకాల) తన కొడుకును ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తాడు. మరోవైపు హీరోయిన్ కాత్యాయని (శివానీ నాగారం) పేరేంట్స్ డాక్టర్లు. వాళ్లు తమ కూతుర్ని డాక్టర్ ను చేయాలని ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తారు. అక్కడ అఖిల్, కాత్యాయని మధ్య పరిచయం కలుగుతుంది.

సినిమా కథాంశం, నటీనటులు

కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ అప్పుడు కాత్యాయని ఓ విషయాన్ని బయటపెడుతుంది. దీంతో లవ్ స్టోరీ కథ మలుపు తిరుగుతుంది. మరి కాత్యాయని చెప్పిన విషయం ఏంటీ? వీళ్ల ప్రేమ విజయవంతమైందా?అన్నదే మిగతా కథ.

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా లేనప్పుడు, స్వచ్ఛమైన బాల్యం, టీనేజీని గడిపిన రోజులకు లిటిల్ హార్ట్స్ మనల్ని తీసుకెళ్తుంది. ఈ వారం మంచి రొమాంటిక్ కామెడీ చూడాలనుకే ఓటీటీ ఆడియన్స్ కు లిటిల్ హార్ట్స్ మంచి ఆప్షన్.

‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ప్రేమకథ, బాల్యాన్ని గుర్తుచేసే అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను వీక్షించి, టీనేజ్ ప్రేమకథను ఆస్వాదించండి. ఇది ఈ వారం ఓటీటీలో తప్పక చూడాల్సిన చిత్రం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.