
మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన లోకా ఛాప్టర్ 1: చంద్ర మూవీ ఓటీటీలోకి వస్తోంది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజైన ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో అక్టోబర్ 31 నుంచి ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Key Points
అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ 'లోకా ఛాప్టర్ 1 చంద్ర' ఓటీటీలోకి.
జియోహాట్‌స్టార్‌లో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు సహా మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటు.
కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం.
లోకా ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫారమ్
మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన లోకా ఛాప్టర్ 1 చంద్ర మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ శుక్రవారం (అక్టోబర్ 24) వెల్లడించింది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1: చంద్ర డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియోహాట్‌స్టార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఏడు భాషల్లో లోకా స్ట్రీమింగ్
“ లోకా ప్రపంచం ఎక్స్‌క్లూజివ్ గా జియోహాట్‌స్టార్ లో తెరుచుకోబోతోంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అని చెప్పింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ లోకా మూవీ స్ట్రీమింగ్ కానుంది.
రూ.300 కోట్ల వసూళ్ల తొలి మలయాళం మూవీ
లోకా మూవీ వసూళ్లు, తారాగణం
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. ‘లోకా ఛాప్టర్ 1’ ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది.
మలయాళం సినీ చరిత్రలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ సూపర్ హీరో మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వివిధ భాషల్లో అందుబాటులోకి వస్తున్న ‘లోకా’ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.


