|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? కేంద్రం ఏం తేల్చి చెప్పింది?

Published: 01-04-2026, 10:05 AM
షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? కేంద్రం ఏం తేల్చి చెప్పింది?
  • గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలను పెంచలేదని కేంద్రం స్పష్టం చేసింది.
  • సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని ప్రకటన.
  • ప్రపంచంలోనే తక్కువ ధరకే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తున్నట్లు వెల్లడి.
  • దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలను పెంచే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

కేంద్రం తాజా ప్రకటనలో ఏం చెప్పింది?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడంతో.. గృహాలను ఆదుకునేందుకు దేశంలో కేవలం కమర్షియల్ ఎల్‌పీజీ ధరను మాత్రమే పెంచినట్లు, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరను యథాతథంగా ఉంచినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

‘పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉన్నాయి. మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. సాధారణంగా నెలవారీగా సవరిస్తారు. దేశంలో వినియోగించే మొత్తం ఎల్పీజీలో వీటి వినియోగం 10 శాతం కంటే తక్కువగా ఉంది.’ అని మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 913 వద్ద యథాతథంగా కొనసాగుతూ, గృహ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉందని ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పీఎంయూవై పథకం కింద పేదల కోసం రాయితీపై అందించే ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 613 వద్ద యథాతథంగా ఉంది.

గృహ వినియోగదారులకు ఊరట!

పాకిస్థాన్‌లో సిలిండర్‌కు రూ. 1,046, శ్రీలంకలో రూ. 1,242, నేపాల్‌లో రూ. 1,208గా ఉన్న ధరతో పోలిస్తే.. భారతదేశ దేశీయ ఎల్‌పీజీ ధర ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సాధారణ పెట్రోల్ , డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ. 94.77, రూ. 87.67 వద్ద యథాతథంగా ఉన్నాయని(ఢిల్లీ ధరలు) మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి లీటరుకు రూ. 2 సవరణ కేవలం ప్రీమియం పెట్రోల్ వేరియంట్‌లైన XP95, Power95, Speed -అధిక ఆక్టేన్ పనితీరు గల ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. వీటి ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తారు. వీటి అమ్మకాలు మొత్తం పెట్రోల్, డీజిల్ ధరల అమ్మకాల పరిమాణంలో 2 నుండి 5 శాతం మాత్రమే ఉంటాయి. వాహనదారులు తమ ఇష్టానుసారం ఈ రకమైన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ధరలు 30-50 శాతం మేర పెరిగినప్పటికీ.. భారతదేశంలోని ప్రతి పంపులోనూ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయి?

మెుత్తానికి ఇంధన ధరలు పెంచే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. చమురు, గ్యాస్ నిల్వలలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే.. ఆందోళనతో అధికంగా కొనాల్సిన పని లేదని చెప్పింది. ప్రస్తుతానికి ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే.. తదుపరి చర్యలపై కూడా కేంద్రం ఇప్పటి నుంచే ఆలోచిస్తోంది. 2022 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు డీజిల్‌, పెట్రోలు ధరలను పెంచలేదని కేంద్రం తెలిపింది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించామని వెల్లడించింది.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

మెుత్తానికి కేంద్రం ఇంధన ధరల పెరుగుదలపై స్పష్టతనిచ్చింది. దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ధరలు పెరిగే అవకాశం లేదని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.