|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్‌ నుంచి ‘మాధురి’ ఎలిమినేట్‌.. భారీగా రెమ్యునరేషన్‌

Published: 03-11-2025, 12:43 AM
బిగ్‌బాస్‌ నుంచి 'మాధురి' ఎలిమినేట్‌.. భారీగా రెమ్యునరేషన్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 నుంచి 8వ వారంలో మాధురి ఎలిమినేట్‌ అయ్యారు. మూడు వారాలకే రూ. 9 లక్షల భారీ రెమ్యునరేషన్‌ అందుకున్న ఆమె, ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. హౌస్‌లో ఆమె ప్రయాణం, ప్రేక్షకుల స్పందనపై పూర్తి వివరాలు ఇక్కడ.

Key Points

1

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 నుంచి 8వ వారంలో మాధురి ఎలిమినేట్ అయ్యారు.

2

కేవలం మూడు వారాలకే ఆమెకు రూ. 9 లక్షల భారీ రెమ్యునరేషన్ లభించింది.

4

హౌస్‌లో ముక్కుసూటి మనిషిగా పేరుపొందిన మాధురి పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

బిగ్‌బాస్‌ నుంచి మాధురి ఎలిమినేషన్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 ( Bigg Boss Telugu) నుంచి 8 వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్‌ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ‌ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ ‌ నుంచి బయటకు వచ్చేశారు . నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే , వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ ‌ మధ్య లాస్ట్ ‌ వరకు గట్టి పోటీ నెలకొంది. . కానీ , ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే , బిగ్ ‌ బాస్ ‌ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ ‌ అందినట్లు తెలుస్తోంది .

సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్ ‌ బిగ్ బాస్ హౌస్‌లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు . కానీ , చాలా బలంగానే తన మార్క్ ‌ వేశారు . అసలైన ఫైర్ ‌ బ్రాండ్ ‌ గా హౌస్ ‌ లో పేరు పొందారు . తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు . మాధురికి ఉన్న ఇమేజ్ ‌ వల్ల బిగ్ ‌ బాస్ ‌ కూడా భారీగానే రెమ్యునరేషన్ ‌ ఇచ్చినట్లు తెలుస్తోంది . కేవలం మూడు వారాలకే రూ . 9 లక్షలు రెమ్యునరేషన్ ‌ తీసుకున్నట్లు సమాచారం . ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ‌ గా ఆమె నిలిచారు . అయితే , ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు . వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు . ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు .

సేవా కార్యక్రమాలకు మాధురి రెమ్యునరేషన్‌

మాధురికి హౌస్ ‌ లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్ ‌ కు గురయ్యారు . తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు . ఆమెను ఎందుకు సెలక్ట్ ‌ చేశారంటూ బిగ్ ‌ బాస్ ‌ టీమ్ ‌ ను కూడా తప్పుబట్టారు . అయితే , హౌస్ ‌ లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం . తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు . తన గేమ్‌లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు .

సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే .. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు . విపరీతమైన నెగటివిటీతో హౌస్ ‌ లోకి అడుగుపెట్టిన మాధురి .. బిగ్ ‌ బాస్ ‌ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు . ఈ సీజన్ ‌ లో చాలా పాపులర్ ‌ కంటెస్టెంట్ ‌ గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్ ‌ తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం .

హౌస్‌లో మాధురి వివాదాస్పద ప్రయాణం

నాకు ముందే తెలుసు : మాధురి హౌస్‌ నుంచి ఈ వారం ఎలిమినేట్ ‌ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు . నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబటట ​ ఇ ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే , తనకు బిగ్‌బాస్‌ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్ ‌ లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు . ఆమె చాలా స్వీట్‌ అంటూ కితాబు ఇచ్చారు . తనూజ సీరియల్‌లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు . తరువాత కల్యాణ్‌ ఎలాంటి మాస్క్‌ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి .. డిమోన్‌ పవన్‌ కూడా చాలా స్వీట్‌ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు . హౌస్‌లో 100శాతం ఫేక్‌ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు .

మాధురి బిగ్‌బాస్‌ ప్రయాణం అనూహ్యంగా ముగిసినప్పటికీ, ఆమె పొందిన భారీ రెమ్యునరేషన్‌, దానిని సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం ప్రశంసనీయం. ఆమె వ్యక్తిత్వంపై మిశ్రమ స్పందనలు ఉన్నా, ఆమె నిర్ణయం అనేకమందిని ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.