|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు, అనిల్ రావిపూడితో మరో బ్లాక్ బస్టర్ మూవీ? ఫ్యాన్స్ కు పండగే!

Published: 10-02-2026, 1:05 AM
మహేష్ బాబు, అనిల్ రావిపూడితో మరో బ్లాక్ బస్టర్ మూవీ? ఫ్యాన్స్ కు పండగే!
  • మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో మరో సెన్సేషనల్ మూవీ?
  • వెంకటేష్‌తో సినిమా తర్వాత మహేష్ మూవీ ట్రాక్ ఎక్కించేందుకు ప్లాన్ చేస్తున్న అనిల్!
  • దిల్ రాజు నిర్మాతగా మహేష్, అనిల్ రావిపూడి సినిమా వచ్చే ఛాన్స్?
  • వారణాసి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో మహేష్ బాబు!

టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సంచలన వార్త వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందా? ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వెంకటేష్‌తో సినిమా తర్వాత మహేష్‌తో మూవీ?

Anil Ravipudi : ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడట. విక్టరీ వెంకటేశ్‌తో మూవీ చేసేందుకు స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్న అనిల్‌ సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్‌ను లాంచ్‌ చేసి ఈ ఇయర్ ఎండింగ్‌లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారడట. ఆ తర్వాత అనిల్ మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నాడట.

మహేష్, అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు సినిమా?

ప్రస్తుతం రాజమౌళితో వారణాసి మూవీ చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. అయితే మహేష్ పార్ట్ మాత్రం ఆరు నెలల ముందే ఫినిష్‌ అవ్వబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరుగుతున్న అనిల్ రావిపూడితో మూవీ అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

వారణాసి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో మహేష్!

వెంకటేశ్‌తో సినిమా అయిపోగానే మహేష్‌తో చేసే మూవీని ట్రాక్ ఎక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అనిల్. స్టోరీపై మహేష్‌తో అనిల్ డిస్కషన్స్ నడుస్తున్నాయ‌ని, త్వరలోనే ఓ క్లారిటీ రాబోతున్నట్లుగా చర్చ నడుస్తోంది. అన్నీ కుదరితే దిల్ రాజ్ ప్రొడ్యూసర్‌గా అనిల్, మహేష్ సినిమా రాబోతోందని అంటున్నారు. వారాణాసి లాంటి గ్లోబల్ మూవీ తర్వాత మహేష్ ఓ ప్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్‌ మూవీ చేయాలనుకోవడం అది అనిల్‌ డైరెక్షన్‌లో ప్లాన్ చేస్తుండటంతో ఈ ఇద్దరి కాంబోలో మరో హిట్ పక్కా అని ఇప్పటినుంచే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఫ్యాన్స్.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఉందా? ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.