
📌 Key Points
- మహేష్ బాబు కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు పయనం.
- హైదరాబాద్ విమానాశ్రయంలో మహేష్, సితార క్యాప్ ధరించిన ఫోటోలు వైరల్.
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు.
- ‘వారణాసి’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భారీ ప్లాన్ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, రాజమౌళితో చేస్తున్న సినిమా, దాని టైటిల్, పాత్రల గురించి ఆసక్తికర లీక్‌లు వెలువడ్డాయి.
న్యూ ఇయర్ కోసం మహేష్ భారీ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న మహేష్ బాబు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ఏదైనా పండుగలు వస్తే చాలు కుటుంబంతో గడిపేస్తూ ఉంటారు. తన ఫ్యామిలీని వెకేషన్ లకు కూడా తీసుకువెళ్తారు మహేష్ బాబు. ఇందులో భాగంగానే న్యూ ఇయర్ కోసం మహేష్ బాబు మరోసారి భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా వెళుతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇందులో భాగంగానే, హైదరాబాద్ విమానాశ్రయంలో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి మెరిశారు. ఈ సందర్భంగా క్యాప్ పెట్టుకుని ఆయన కూతురు సితార కనిపించగా మహేష్ బాబు కూడా సేమ్ క్యాప్ పెట్టుకుని మెరిశారు. ఈ ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో న్యూ ఇయర్ వేడుకలలో భాగంగానే విదేశాలకు మహేష్ వెళ్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు పాత్రలలో కనిపిస్తారట. link
కుటుంబంతో విదేశాలకు.. వైరల్ ఫోటోలు
రాజమౌళి సినిమాపై సంచలన లీక్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకవైపు, రాజమౌళితో మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా లీక్‌లు మరోవైపు అభిమానులకు డబుల్ ధమాకాను అందిస్తున్నాయి. ఐదు పాత్రలలో మహేష్ బాబును చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


