
📌 Key Points
- మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో `వారణాసి` మూవీ.. భారీ బడ్జెట్!
- ప్రియాంక చోప్రా హీరోయిన్, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.. అదిరిపోయే కాంబినేషన్!
- `వారణాసి` విడుదల కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలు.. క్యూలో మైత్రీ మూవీ మేకర్స్, సన్ పిక్చర్స్!
- సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఉంటుందా? త్వరలో మహేష్‌ని కలవనున్న వంగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ మామూలుగా లేదు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న `వారణాసి` సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
రాజమౌళితో మహేష్ మూవీ.. భారీ అంచనాలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `వారణాసి` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్ ఫిల్మ్ ఇది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో, అంతర్జాతీయ మార్కెట్‌కి చేరువయ్యేలా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎస్ నారాయణ నిర్మిస్తున్నారు. సుమారు రూ. 1400కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీ ఇదే కావడం విశేషం.
ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌ని మార్చేయబోతుంది. ఆయన్ని గ్లోబల్ స్టార్‌ని చేయబోతుంది. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేష్ ఒకేసారి గ్లోబల్ రేంజ్ మూవీ చేస్తుండటం విశేషం. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. అదే స్థాయిలో మార్కెటింగ్ చేయబోతున్నారు. మూడు వేలకోట్లకుపైగానే కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుని, ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసమే మహేష్ తోపాటు సినీ వర్గాలు, అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
నిర్మాణ సంస్థల క్యూ.. ఎవరికి ఛాన్స్?
`వారణాసి` వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాదికిపైగానే ఉంది. కానీ ఇప్పట్నుంచే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు క్యూ పెరిగిపోతుంది. నిర్మాణ సంస్థలు మహేష్‌తో మూవీస్ చేసేందుకు క్యూ కడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇందులో మొదటి వరుసలో ఉంది. రాజమౌళితో మూవీ అనంతరం నెక్ట్స్ తమ బ్యానర్‌లోనే మూవీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. అలాగే సన్ పిక్చర్స్, హోంబలే ఫిల్మ్స్ కూడా క్యూలో ఉన్నాయట. వీటితోపాటు మరో రెండు హిందీ ప్రొడక్షన్ హౌజెస్ కూడా మహేష్ బాబుతో మూవీకి ప్లాన్ చేస్తున్నాయట. ఇప్పట్నుంచే ఈ బ్యానర్స్ కథలు వినిపించే పనిలో ఉన్నట్టు సమాచారం.
అయితే మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమాలు చేసే దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ముందు వరుసలో ఉంటారని సమాచారం. మహేష్ బాబుతో ఆయనకు మంచి ర్యాపో ఉంది. `యానిమల్` మూవీ మహేష్ చేయాల్సింది. కానీ సెట్ కాలేదు. త్వరలో మరో కథతో మహేష్‌ని కలుస్తానని పలు ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తెలిపారు. అన్నీ కుదిరితే సందీప్‌తో మూవీ ఉండే ఛాన్స్ ఉంది. వీరితోపాటు కోలీవుడ్, బాలీవుడ్, ఇతర తెలుగు దర్శకులు కూడా మహేష్ కోసం కథలు రెడీ చేస్తున్నారట.
సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఉంటుందా?
ఇవన్నీ ఇప్పుడు ప్రైమరీ డిస్కషన్ స్టేజ్‌లోనే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్.. `వారణాసి` షూటింగ్‌లోనే బిజీగా ఉన్నారు. టైమ్ దొరికినప్పుడు కథలు వింటున్నారని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, `వారణాసి` రిలీజ్ తర్వాతనే, దాని రిజల్ట్ ని బట్టి ఆయన ఎవరితో చేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కానీ పలు భారీ నిర్మాణ సంస్థలు మాత్రం అడ్వాన్స్ లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయట.
`వారణాసి` సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా మారడం ఖాయం. ఆ తర్వాత ఆయన చేయబోయే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


