
📌 Key Points
- గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభను కొనియాడిన మహేష్ బాబు – ‘యుఫోరియా’ మూవీ అద్భుతంగా ఉందని ప్రశంసలు!
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ‘యుఫోరియా’ చిత్రాన్ని చూసి గుణశేఖర్ మేకింగ్‌ను అభినందించారు – తప్పక చూడాల్సిన సినిమా అని కితాబు!
- భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ‘యుఫోరియా’ – నటీనటుల అద్భుత నటన!
- పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా గౌతమ్ మీనన్ పాత్ర – కేసు దర్యాప్తు సన్నివేశాలు వాస్తవికంగా చిత్రీకరణ!
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభకు ముగ్దుడైన మహేష్ బాబు సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం!
మహేష్ బాబు ఏమన్నారంటే..
విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు గుణ శేఖర్ (Guna Shekhar)గత వారం (ఫిబ్రవరి 6) ‘యుఫోరియా’ (Euphoria)అంటూ బాక్సాఫీస్ సందడి చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ, కథాంశంతో గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవలె తెలంగాణ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గుణశేఖర్ మేకింగ్‌ను ఆయన కొనియాడారు.
మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
ప్రజలందరూ తప్పక చూడాల్సిన సినిమా అని మెచ్చుకున్నారు. తాజాగా.. మమేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ‘యుఫోరియా’ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘గుణశేఖర్ గారు తన కథలను ఎలా ప్రెజెంట్ చేస్తారనే విషయంలో ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలి ఉంటుంది.. ఈ మూవీని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు నాకెంతో నచ్చింది.. ఈ మూవీని అందరూ తప్పక చూడండి. గుణశేఖర్ గారూ, భూమిక, టీం మొత్తానికి అభినందనలు. గుణ శేఖర్ గారి మేకింగ్, ఆయన టెక్నికల్ టీం మ్యాజిక్ చేసింది’’ అని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన సారా అర్జున్ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భూమికా చావ్లా(Bhumika Chawla), గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon), సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు కీలక పాత్రలో నటించారు.
‘యుఫోరియా’లో నటీనటుల అభినయం
ప్రముఖ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ కమీషనర్ జయదేవ్ నాయర్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. గౌతమ్ మీనన్ పాత్రతో పోక్సో చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారు.. కేసు దర్యాప్తులో సమయంలో ఎలా సాక్ష్యాల్ని సేకరిస్తారు? అనే విషయాల్ని ఎంతో వాస్తవికంగా చిత్రీకరించారు. నీలిమా గుణశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందించారు. ఈ చిత్రం సాంకేతికంగా కూడా ప్రత్యేకంగా నిలిచింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన పరిణామాలను హైలైట్ చేయడంతో పాటు, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల ప్రాముఖ్యతను కూడా ఈ చిత్రం నొక్కి చెప్పింది.
మొత్తానికి ‘యుఫోరియా’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహేష్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి ప్రముఖులు సినిమాను మెచ్చుకోవడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


