
SSMB-29 సందడి మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ చిత్రం నుంచి హీరో లుక్‌ను రివీల్ చేస్తూ రాజమౌళి పోస్ట్ చేశారు. ‘రుద్ర’ పాత్రలో బసవపై వస్తున్న మహేశ్ బాబు పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది, సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Key Points
SSMB-29కి 'వారణాసి' టైటిల్ ఖరారు, గ్లింప్స్ క్షణాల్లో వైరల్ అయింది.
రాజమౌళి మహేశ్ బాబు 'రుద్ర' పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.
మహేశ్ బాబు బసవ (ఎద్దు)పై వస్తున్న లుక్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా నటిస్తున్నారు.
SSMB29: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ విడుదల
SSMB-29 సందడి స్టార్ట్ అయింది. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తు్న్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో పాటు అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వర్క్ చేస్తున్న ముఖ్యమైన పాత్రలకు సంబంధించి ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా పరిచయం చేసి హైప్ పెంచేశారు మేకర్స్. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మహేశ్ బాబు పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు డైరెక్టర్ రాజమౌళి. ‘వారణాసి’లో మహేశ్ బాబు ‘రుద్ర’అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశాడు. పురాణాలలో, సంస్కృతిలో అండ్ పండుగలలో కనిపించే బసవ (ఎద్దు)పై వస్తున్న మహేశ్ లుక్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో కూడా సినిమాపై హైప్‌ను మరింత క్రియేట్ చేసింది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతున్నది. లింక్
మహేశ్ బాబు ‘రుద్ర’ లుక్ రివీల్
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పాత్రల వివరాలు
మహేశ్ బాబు ‘రుద్ర’ లుక్ విడుదలైన తర్వాత ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పాత్రల పరిచయం ఇప్పటికే హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మహేశ్ బాబు లుక్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


