|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేశ్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వైరల్‌

Published: 15-11-2025, 9:48 AM
మహేశ్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వైరల్‌

మహేశ్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB-29 సినిమా టైటిల్ రివీల్ అయింది. ‘వారణాసి’ పేరుతో విడుదలైన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించి అభిమానులను అలరించారు.

Key Points

1

SSMB-29 సినిమాకు 'వారణాసి' టైటిల్ ఖరారు.

2

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లింప్స్ విడుదల.

4

ప్రియాంక చోప్రా 'మందాకిని', పృథ్వీరాజ్ 'కుంభ' పాత్రలు పరిచయం.

SSMB-29 టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ ఈవెంట్

ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న SSMB-29 టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ప్రజెంట్ అందరి కళ్లు మహేశ్ బాబు(Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌(Globe Trotter Event)పైనే ఉంది. హైదరాబాద్ శివారులో అత్యంత గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌కు అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే టైటిల్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. టైటిల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు SSMB-29కు ‘వారణాసి’(Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా.. గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త వైల్డ్ లుక్స్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్‌తో పాటు మహేశ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండీగా మారాయి. కాగా.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా పరిచయం చేసి హైప్ పెంచేశారు మేకర్స్.

‘వారణాసి’గా మహేశ్-రాజమౌళి సినిమా

వైరల్ అవుతున్న మహేశ్ కొత్త లుక్

‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్‌తో SSMB-29 సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మహేశ్ బాబు కొత్త లుక్‌తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పాత్రల పరిచయం సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.