|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahesh Babu : మళ్ళీ చనిపోతాడని రాజీవ్ కనకాలను వద్దన్న మహేష్ బాబు.. కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్..

Published: 05-10-2025, 10:16 PM
Mahesh Babu : మళ్ళీ చనిపోతాడని రాజీవ్ కనకాలను వద్దన్న మహేష్ బాబు.. కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్..

సినీ పరిశ్రమలో పాత్రలు మారడం సర్వసాధారణం. అయితే ‘పోకిరి’ సినిమాలో అజయ్ పాత్ర రాజీవ్ కనకాల చేయాల్సింది. రాజీవ్ కనకాలకు చనిపోయే పాత్రలు ఎక్కువగా వస్తున్నాయని, మళ్ళీ అదే రిపీట్ అవుతుందని మహేష్ బాబు స్వయంగా అజయ్ పేరును సూచించారు. ఇది ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ గా మారింది.

Key Points

1

మహేష్ బాబు 'పోకిరి'లో రాజీవ్ కనకాల స్థానంలో అజయ్ ను సూచించారు.

2

రాజీవ్ కనకాలకు తరచుగా చనిపోయే పాత్రలు రావడంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

4

పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో రాజీవ్ కనకాలకు ఆ గొప్ప అవకాశం మిస్సయింది.

పోకిరిలో అజయ్ పాత్ర ఎలా వచ్చిందంటే?

Mahesh Babu : సినిమాల్లో ఒకరు చేయాల్సిన పాత్ర పలు కారణాలతో ఇంకొకరికి వెళ్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమలో ఇది సర్వ సాధారణమే. అలా రాజీవ్ కనకాల చేయాల్సిన ఓ పాత్ర మరొకరికి వెళ్ళింది. రాజీవ్ కనకాలకు ప్రతి సినిమాలో తన పాత్రని చంపేస్తున్నారు. దీంతో రాజీవ్ పాత్ర అంటే సినిమాలో ఆయన కచ్చితంగా చనిపోయే పాత్రే అని ఫిక్స్ అయ్యారు అంతా. దీనిపై కొన్నాళ్ళు సోషల్ మీడియాలో సరదా ట్రోలింగ్ కూడా జరిగింది.(Mahesh Babu)

రాజీవ్ కనకాల కూడా మీడియా ముందు తనకు అన్ని చనిపోయే పాత్రలే తెస్తున్నారని, చనిపోని పాత్రలు ఉంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అన్నారు కూడా. దీనిపై నటుడు అజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అజయ్ పోకిరి సినిమాలో మహేష్ బాబు పక్కన ఫ్రెండ్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే అజయ్ కి స్టార్ డమ్ వచ్చింది. అయితే ఆ పాత్ర రాజీవ్ కనకాల చేయాలంట.

మహేష్ బాబు సలహా వెనుక అసలు కారణం

నటుడు అజయ్ మాట్లాడుతూ.. పోకిరి సినిమాలో నా పాత్ర రాజీవ్ కనకాల చేయాలి. ‘అతడు’ సినిమాలో ఆల్రెడీ రాజీవ్ ది చనిపోయే పాత్ర కదా మళ్ళీ అదే రిపీట్ అయి ఇందులో కూడా చనిపోయే పాత్ర అయితే బాగోదు అని మహేష్ గారే నన్ను పూరి జగన్నాధ్ కి సజెస్ట్ చేసారు అని తెలిపాడు. పోకిరి సినిమాలో అజయ్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. అతడు సినిమాలో రాజీవ్ కనకాల కేవలం 5 నిమిషాలే ఉంటాడు. ఆ పాత్రని చంపేస్తారు. అలా మళ్ళీ పోకిరిలో కూడా చనిపోయే పాత్రే అని రాజీవ్ కనకాలను వద్దన్నారట మహేష్.

రాజీవ్ కనకాల ‘మరణ’ పాత్రల సరదా ట్రోలింగ్

దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల చనిపోయే పాత్రలు అప్పట్నుంచే చేస్తున్నారని, మహేష్ ముందే గుర్తించి ఒక సినిమాలో చనిపోకుండా కాపాడాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా రాజీవ్ కి మిస్ అయిందని అంటున్నారు.

Also See : Rashmika Mandanna : నిశ్చితార్థం తర్వాత ఆ హాట్ సాంగ్ నుంచి.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రష్మిక.. ఫొటోలు..

మహేష్ బాబు ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో అజయ్ కు స్టార్‌డమ్ ఇచ్చింది. రాజీవ్ కనకాలకు ఒక పెద్ద హిట్ మిస్సయింది. సినీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇది మహేష్ బాబు అభిమానులకు ఆసక్తికరమైన అంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.