
📌 Key Points
- మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
- సినిమాలో రామాయణం ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది, ఇది మైథాలజీ సినిమా అని రాజమౌళి తెలిపారు.
- 2026 జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయనున్నారు.
- మహేష్ బాబు రుద్ర పాత్రలో, రాముడి పాత్రలో కూడా కనిపించనున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. రామాయణం ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడం విశేషం. జక్కన్న ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు.
వారణాసి మూవీ షూటింగ్ అప్డేట్స్
Varanasi film: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించింది. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం మూడు నాలుగు సంవత్సరాలు సమయం పడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం జక్కన్న ఫుల్ స్పీడ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడో తేదీ గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో ఓ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ మౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని ఈ సినిమా మైథాలజీ సినిమాగా రాబోతుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ సినిమా షూటింగ్ గురించి కూడా జక్కన్న అప్డేట్ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి అయిందని రాజమౌళి తెలియచేశారు.
రామాయణం ఎపిసోడ్ పై రాజమౌళి క్లారిటీ
షూటింగ్లో భాగంగానే రామాయణ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని కేవలం 50% షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఈ సినిమా షూటింగా 2026 జూన్ నాటికి పూర్తి అవుతుంది అంటూ రాజమౌళి తెలియచేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏడాదిలోపే రాజమౌళి గ్లోబల్ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు అంటే మామూలు విషయం కాదు వారణాసి విషయంలో రాజమౌళి చాలా స్పీడున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజమౌళి ఇప్పటినుంచి ఆ దిశగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని బడ్జెట్ కాకుండా అదనంగా 200 కోట్లు కేవలం ప్రమోషన్లకు మాత్రమే కేటాయించారని తెలుస్తుంది. రాజమౌళి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
2027లో విడుదల కానున్న వారణాసి
‘వారణాసి’ సినిమా గ్లోబల్ స్థాయిలో విడుదల కానుండటంతో రాజమౌళి ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


