
డైరెక్టర్ తేజ తన కెరీర్‌లో ఫ్లాప్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు ‘నిజం’ సినిమానే తన అన్ని ఫ్లాప్‌లకు కారణమని తేజ పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాతే ఆయనకు విజయాలు దూరం అయ్యాయని తెలిపారు.
Key Points
డైరెక్టర్ తేజ తన ఫ్లాప్స్ అన్నింటికీ మహేష్ బాబు 'నిజం' సినిమానే కారణమన్నారు.
'నిజం' ముందు వరకు తేజకు ఒక్క ఫ్లాప్ కూడా లేదని పేర్కొన్నారు.
'నిజం' తర్వాత 14 ఏళ్ళకు గానీ తేజ సక్సెస్ చూడలేకపోయారు.
మహేష్ బాబు నటించిన 'నిజం' చిత్రం లంచం, అవినీతిపై తిరుగుబాటు కథాంశంతో రూపొందింది.
తేజ కెరీర్ మలుపు తిప్పిన ‘నిజం’
డైరెక్టర్ తేజ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలో కొత్త తరం హీరోలు ఎంటర్ అవుతున్న 2000 ఆరంభంలో డైరెక్టర్ తేజ యువతకి కనెక్ట్ అయ్యే అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలు అందించారు. అప్పటి యువత ఆలోచనలని ప్రతిభింబించేలా ఆయన చిత్రాలు ఉండేవి. జయం, చిత్రం, నువ్వు నేను లాంటి చిత్రాల గురించి విపరీతంగా యువత మాట్లాడుకునేవారు.
డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రతి చిత్రం గురించి ఒక్క మాటలో వర్ణిస్తూ తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు నిజం మూవీ గురించి తేజ ఎవ్వరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. నిజం మూవీ గురించి చెప్పమని యాంకర్ ప్రశ్నించగా.. ‘నా ఫ్లాప్ సినిమాలన్నింటికీ అదే కారణం’ అని తేజ బదులిచ్చారు.
మహేష్ బాబు ‘నిజం’పై తేజ సంచలన వ్యాఖ్యలు
నిజం ముందు వరకు తేజకి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. నిజం తర్వాత నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయ్యే వరకు తేజ తెరకెక్కించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అవుతూ వచ్చాయి. నిజం తర్వాత సక్సెస్ టేస్ట్ చేయడానికి తేజకి 14 ఏళ్ళు పట్టింది. బహుశా అందుకే తేజ.. తన ఫ్లాప్ సినిమాలకు కారణం నిజం అని అన్నారేమో.
మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లంచం, అవినీతిపై తిరుగుబాటు కథాంశంతో రూపొందింది. గోపీచంద్ విలన్ గా నటించారు. గోపీచంద్ తో పాటు రాశి పాత్ర కూడా ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. మహేష్ బాబు ఇలాంటి సందేశాత్మక చిత్రంలో నటించడం కూడా ఫ్యాన్స్ కి ఎక్కలేదు. ఫలితంగా నిజం మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
వరుస ఫ్లాప్‌లకు ‘నిజం’ కారణమా?
ఇక తేజ ఒక్కో చిత్రం గురించి అభివర్ణిస్తూ.. ”చిత్రం.. నా ఫేవరేట్, ఫ్యామిలీ సర్కస్.. మంచి కామెడీ, నువ్వు నేను.. మంచి స్క్రీన్ ప్లే, జయం.. క్లాసిక్, నిజం.. నా ఫ్లాప్స్ అన్నింటికీ కారణం” అని అన్నారు.
మొత్తంగా, తేజ కెరీర్‌లో ‘నిజం’ సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిందో తేజ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంచలన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.


