
ఆర్జీవీ-నాగార్జునల బ్లాక్‌బస్టర్ ‘శివ’ 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. అప్పట్లో కేవలం 75 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. రీ-రిలీజ్ సందర్భంగా దాని కలెక్షన్స్ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.
Key Points
ఆర్జీవీ-నాగార్జున కాంబోలో వచ్చిన మొదటి బ్లాక్‌బస్టర్ 'శివ' రీ రిలీజ్ అవుతోంది.
1989లో 'శివ' సినిమా కేవలం 75 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కింది.
తెలుగులో 4 కోట్లు, తమిళంలో 2 కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డు సృష్టించింది.
హిందీ రీమేక్‌కు 1.15 కోట్లు ఖర్చు, అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించింది.
శివ సినిమా రీ రిలీజ్ విశేషాలు
RGV : ఆర్జీవీ – నాగార్జున కాంబోలో వచ్చిన మొదటి సినిమా, బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా శివ. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి శివ సంగతులు వైరల్ గా మారాయి. 1989 లో శివ సినిమా రిలీజయింది.
అసలు అప్పట్లో శివ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? శివ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో తెలుసా?
అప్పట్లో ‘శివ’ బడ్జెట్ అండ్ కలెక్షన్స్
శివ సినిమాకు అప్పట్లో దాదాపు 75 లక్షల బడ్జెట్ అయింది. ఇప్పుడు అయితే ఆ బడ్జెట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ కి కూడా రావేమో. 75 లక్షల్లో ఆర్జీవీ శివ సినిమాని తీశారు. మొదట తెలుగులో రిలీజ్ చేసారు. తెలుగులో పెద్ద హిట్ అయింది. తెలుగులో శివ సినిమా ఓవరాల్ గా నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం నైజం ఏరియాలోనే ఒక కోటి రూపాయలు కలెక్షన్స్ సాధించింది శివ సినిమా.
తెలుగు, తమిళ, హిందీలలో శివ విజయం
ఆ తర్వాత శివ సినిమా ఉద్యం పేరుతో తమిళ్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. తమిళ్ లో శివ సినిమా ఏకంగా రెండు కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అనంతరం 1990లో శివ సినిమాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేసారు. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి హిందీ రీమేక్ తీశారు ఆర్జీవీ. హిందీ సినిమాకు ఒక కోటి 15 లక్షలు ఖర్చు అయింది. హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి అక్కడ కూడా పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ రీ రిలీజ్ లో శివ సినిమా ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుందో చూడాలి.
అప్పట్లో 75 లక్షలతో సంచలనం సృష్టించిన ‘శివ’ సినిమా 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కావడం సినీ ప్రియులకు పండుగే. RGV విజన్‌కు నిదర్శనమైన ఈ చిత్రం, ఈసారి ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


