|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మలైకా ఘాటు రిప్లై: నా వ్యక్తిగత జీవితంపై మీ పిచ్చి రాతలు ఆపండి! నేను ఎవరికీ జవాబు చెప్పను!

Published: 27-03-2026, 8:05 AM
మలైకా ఘాటు రిప్లై: నా వ్యక్తిగత జీవితంపై మీ పిచ్చి రాతలు ఆపండి! నేను ఎవరికీ జవాబు చెప్పను!
  • అర్జున్ కపూర్‌తో మలైకా బ్రేకప్
  • వయసులో చిన్నవారితో మలైకా డేటింగ్ చేస్తుందన్న వార్తలు
  • పుకార్లపై మలైకా ఘాటు వ్యాఖ్యలు
  • తన వ్యక్తిగత జీవితం తన ఇష్టమన్న మలైకా

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తనకంటే చిన్నవయసు వారిని డేటింగ్ చేస్తుందన్న వార్తలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ రూమర్స్‌కు ఆమె ఎలా సమాధానం చెప్పారో చూడండి.

మలైకా అరోరా వ్యక్తిగత జీవితంపై విమర్శలు

Malaika Arora:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్న మలైకా అరోరా (Malaika Arora) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా వయసులో తనకంటే చిన్నవాళ్లతో ఎప్పుడూ డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత వారసుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ . 2018లో మొదలైన వీరి బంధం అనూహ్యంగా 2024లో బ్రేకప్ అయ్యింది.

ఇకపోతే అప్పటినుంచి ఎవరికి వారు విడిగానే ఉంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో గత కొంతకాలంగా ఈమె హర్ష్ మెహతా, సోరబ్ బేడి లతో అప్పుడప్పుడు కలసి కనిపించడంతో మళ్లీ తనకంటే వయసులో చిన్న వారితో మలైకా అరోరా డేటింగ్ చేస్తోంది అంటూ పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లకు విసిగిపోయానని తెలిపిన మలైకా అరోరా అందుకు తగ్గట్టుగానే గట్టి సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

డేటింగ్ రూమర్స్‌పై మలైకా ఫైర్

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి వార్తలు వస్తే మాత్రం కొంతమంది వెంటనే స్పందించి సరైన సమాధానం చెబుతూ ఉంటారు. ఇంకొంద మంది కంగారు పడిపోతారు. కానీ మలైకా మాత్రం చాలా కూల్ గా స్పందించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.. మలైకా మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కూడా నన్ను ఎవరో ఒకరితో ముడి పెట్టడం నిజంగా చిరాకు తెప్పిస్తోంది. అయితే ఇప్పుడు నేను వాటిని ఒక జోక్ లాగా చూస్తున్నాను. నా కొడుకు అర్హాన్ ఖాన్, నేను కలసి కూర్చొని ఈ పిచ్చి కూతలను, వార్తలను చూసి తెగ నవ్వుకుంటున్నాము. నిజానికి నా కొడుకుకు నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. నేను ఒక సింగిల్ మదర్ గా ఉన్నప్పటికీ నా సామ్రాజ్యాన్ని నేనే నిర్మించుకున్నాను.

సింగిల్ మదర్‌గా మలైకా స్ట్రాంగ్ స్టేట్‌మెంట్

చిన్నప్పటి నుంచి నేను ఎవరిపై కూడా ఆధారపడి బ్రతకలేదు. నా స్వయం కృషితో ఎదిగిన మహిళను నేను.. నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నాకు ఏ ఒక్క మగవాడి తోడు అవసరం లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా ఉండాలనుకుంటే మాత్రం అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయమే.. కాబట్టే అది ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది మలైకా అరోరా. ఇక ప్రస్తుతం మలైకా అరోరా చేసిన ఈ కామెంట్ తో డేటింగ్ పుకార్లకు చెక్ పడిందనే చెప్పాలి. అంతేకాదు ఇలా డేటింగ్ రూమర్లతో నిత్యం తనను విమర్శిస్తున్న వారికి మలైకా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా ఈయనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

మొత్తానికి మలైకా అరోరా తన డేటింగ్ రూమర్స్‌కు గట్టిగా సమాధానం చెప్పింది. తన వ్యక్తిగత జీవితం తన ఇష్టమని, ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.