
📌 Key Points
- మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలపై మీడియా ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
- దళపతి విజయ్‌తో ఏడేళ్ల స్నేహం, గౌరవం ఉందని స్పష్టం చేసింది.
- విజయ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా భావించడానికి గర్వపడుతున్నానని తెలిపింది.
- భవిష్యత్తులో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని మీడియాకు సూచించింది.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై మీడియా అతిగా జోక్యం చేసుకోవడంపై నటి మాళవిక మోహనన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా దళపతి విజయ్‌తో తన బంధంపై అడిగిన ప్రశ్నలపై ఆమె సంచలన పోస్ట్ చేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని హితవు పలికింది.
మీడియా తీరుపై మాళవిక ఫైర్
Malavika Mohanan: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో మీడియా హద్దులు దాటడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. తాజాగా ఇటువంటి చేదు అనుభవమే ఎదురవడంతో ప్రముఖ స్టార్ బ్యూటీ మాళవికా మోహనన్ తెగ ఫైర్ అయిపొయింది.. కేవలం వ్యూస్, క్లిక్ బైట్స్ మరియు చీప్ పాపులారిటీ కోసమే కొందరు రిపోర్టర్లు ఇలాంటి అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేసిన పోస్ట్ ప్రస్తుతం సౌత్ సినీ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో
సహజంగానే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండే మాళవిక తమిళనాడు మీడియా మరియు అక్కడి జర్నలిస్టుల పట్ల ఎంతో గౌరవం తో ఉంటుంది . కానీ నిన్నటి ఈవెంట్‌లో ఒకరిద్దరు రిపోర్టర్లు ప్రవర్తించిన తీరు, అడిగిన ప్రశ్నలు ఆమెను తీవ్రంగా బాధించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్నలపై ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విజయ్‌తో తనకు గత ఏడేళ్లుగా ఎంతో అద్భుతమైన పరిచయం ఉందని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని మాళవిక స్పష్టం చేశారు.
విజయ్‌తో మాళవిక బంధంపై స్పష్టత
విజయ్‌ని తన బెస్ట్ ఫ్రెండ్ గా భావించడానికి తాను ఎప్పుడూ గర్వపడతానని, ఒక సాటి నటుడిగా, వ్యక్తిగా ఆయన సాధించిన అద్భుతమైన ఎదుగుదలను, ఆయన పొలిటికల్ అండ్ సినిమా జర్నీని పక్కనుండి చూడటం ఒక గొప్ప అనుభూతి అని మెచ్చుకుంది. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్‌లలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవిస్తూ, మర్యాదపూర్వకంగా ప్రశ్నలు అడగాలని, అది అందరికీ మంచిదని ఆమె తేల్చి చెప్పింది.
‘మాస్టర్’లో హీరోయిన్ గా మాళవిక
నిజానికి మాళవికా మోహనన్ మరియు దళపతి విజయ్ కాంబినేషన్ కు కోలీవుడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మాస్టర్’లో మాళవిక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయం నుంచే విజయ్ తో ఆమెకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ ఏడాది కూడా ఆమె విక్రమ్ సరసన నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ (ఆగస్టు 2024) సినిమాతో నటిగా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ కామెడీ ‘రాజా సాబ్’ సినిమాలో తలుక్కుమన్న సంగతి తెల్సిందే.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై గౌరవం
బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో నటిస్తూ
ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో, ఆమె టాలెంట్ ను పక్కన పెట్టి కేవలం కాంట్రవర్సీల కోసమే కొందరు మీడియా ప్రతినిధులు ఇలాంటి పడికట్టు ప్రశ్నలు వేయడం పట్ల నెటిజన్లు కూడా మాళవికకు సపోర్ట్ చేస్తున్నారు.ఇక సెలబ్రిటీలకైనా ప్రైవసీ ఉంటుందని, వ్యూస్ కోసం దిగజారొద్దంటూ ఇప్పటికే కామెంట్లతో హోరెతిస్తున్నారు సోషల్ మీడియా జనాలు .
మొత్తానికి, మాళవిక మోహనన్ మీడియాకు ఇచ్చిన ఈ సందేశం సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చర్చను తిరిగి లేవనెత్తింది. భవిష్యత్తులోనైనా మీడియా హద్దులు దాటకుండా వ్యవహరించాలని ఆమె ఆకాంక్షించింది.


