|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సందీప్ రెడ్డి వంగా హీరోయిన్‌గా.. మాళవిక మోహనన్ డ్రీమ్! కియారా, త్రిప్తిలా క్రేజ్ కావాలంటున్న బ్యూటీ?

Published: 02-01-2026, 4:30 AM
సందీప్ రెడ్డి వంగా హీరోయిన్‌గా.. మాళవిక మోహనన్ డ్రీమ్! కియారా, త్రిప్తిలా క్రేజ్ కావాలంటున్న బ్యూటీ?
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటిస్తోంది.
  • సందీప్ రెడ్డి వంగా తన హీరోయిన్స్‌ను ప్రత్యేకంగా ప్రెజెంట్ చేస్తారని మాళవిక ప్రశంసించింది.
  • కియారా అద్వానీ (కబీర్ సింగ్), త్రిప్తి డిమ్రి (యానిమల్)లకు వంగా ద్వారా వచ్చిన క్రేజ్‌ను ప్రస్తావించింది.
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే కోరికను పరోక్షంగా బయటపెట్టిన మాళవిక.

నటి మాళవిక మోహనన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హీరోయిన్స్‌కు ఇచ్చే క్రేజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కియారా అద్వానీ, త్రిప్తి డిమ్రిలకు వచ్చిన హైప్‌ను ప్రస్తావిస్తూ, పరోక్షంగా తానూ వంగాతో నటించాలనే కోరికను బయటపెట్టింది.

మాళవిక మోహనన్ ‘ది రాజాసాబ్’ అప్‌డేట్స్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన హీరోయిన్స్ కి సరికొత్త క్రేజ్ తీసుకువస్తాడంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan).

Malavika Mohanan interesting comments about Sandeep Reddy Vanga Heroines

Malavika Mohanan: మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సందీప్ రెడ్డి హీరోయిన్స్ పై క్రేజీ కామెంట్స్

చాలా కాలం తరువాత ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపించడం, హీరోయిన్స్ తో రోమాన్స్ చేయడం, కామెడీ, డాన్స్ చేయడం వంటివి ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Thanuja Puttaswamy: బంతిపువ్వు రంగు చీరలో పూబంతిలా.. తనూజ లేటెస్ట్ ఫొటోస్

వంగా దర్శకత్వంలో నటించే కోరిక

దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి వంగా తన హీరోయిన్స్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు.

దాంతో, వారికి ఒక కొత్త హైప్ క్రియేట్ అవుతుంది. కబీర్ సింగ్ తో కియారా అద్వానీకి అలాంటి క్రేజ్ వచ్చింది. యానిమల్ తో తృప్తి డిమ్రి కి కూడా అలాంటి ఒక హిప్ క్రియేట్ అయ్యింది. స్పిరిట్ తో అది కంటిన్యూ అవుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ డైరెక్టర్ గా తనకు కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించాలని ఉంది అనే కోరికను ఇలా బయటపెట్టింది. చూడాలి, మరి ఈ కామెంట్స్ తో కనీసం తన నెక్స్ట్ సినిమాలో అయినా మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకుంటాడా సందీప్ అనేది చూడాలి.

మాళవిక మోహనన్ తన ఆకాంక్షను వెల్లడించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ తో సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ సినిమాలో మాళవికను తీసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది భవిష్యత్తులో చూసే విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.