
📌 Key Points
- రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ రావడం పట్ల ‘పిఠాపురంలో’ చిత్ర బృందం శుభాకాంక్షలు.
- ‘పిఠాపురంలో’ చిత్రం రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా.
- ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటన అద్భుతంగా ఉంటుందని దర్శకుడు మహేష్ చంద్ర ప్రశంసించారు.
- ‘పిఠాపురంలో’ చిత్రం ముగ్గురు తండ్రుల కథ అని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ‘పిఠాపురంలో’ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. పద్మశ్రీ అవార్డు తర్వాత రాజేంద్రప్రసాద్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆయన నటన అద్భుతంగా ఉంటుందని దర్శకుడు మహేష్ చంద్ర అన్నారు.
రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ: చిత్ర బృందం శుభాకాంక్షలు
Pithapuramlo: ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలలో ‘పద్మశ్రీ’ (Padma Shri) వరించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ వచ్చిన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని, సెలబ్రిటీలెందరో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కూడా ఈ అవార్డుకు ప్రేక్షకులే కారణమని ఓ వీడియోను విడుదల చేసి, సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా తాజాగా ‘పిఠాపురంలో’ (Pithapuramlo) చిత్రబృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ అప్డేట్‌ను తెలియజేసింది. పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే డా. రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం ‘పిఠాపురంలో’ కావడం తమ అదృష్టమని చిత్ర దర్శకుడు మహేష్ చంద్ర సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా మహేష్ చంద్ర ప్రశంసించారు. ‘పిఠాపురంలో’ సినిమా విషయానికి వస్తే..
‘పిఠాపురంలో’ చిత్ర విశేషాలు
‘ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం’ వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూ. పవన్ కళ్యాణ్ తదితరులు ఇతక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
దర్శకుడు మహేష్ చంద్ర ఏమన్నారంటే…
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర (Mahesh Chandra) మాట్లాడుతూ.. ఇది ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ. ప్రస్తుత ఇంటర్ నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ. ఈ సినిమా చూస్తుంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని, చాలా కుటుంబాల్ని, ఎంతోమంది జీవితాలను చూస్తున్నట్టుగానే ఉంటుంది. అలాగని ఇదేదో పక్తు సెంటిమెంట్ సినిమా అని మాత్రం అనుకోవద్దు. ఇందులో ప్రేమ ఉంది. రొమాన్స్ ఉంది. వినోదం ఉంది. పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. చక్కని పాటలున్నాయి. అటు యువతని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో ‘పిఠాపురం’ పేరు ఎంతలా చర్చల్లో నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథను మలిచాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్యా మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.సి. క్రిష్ అందిస్తున్నారు.
మొత్తానికి ‘పిఠాపురంలో’ చిత్రం రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోనుంది. పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం కావడం విశేషం.


