
మలయాళం క్రైమ్ కామెడీ చిత్రం ‘సాహసం’ ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ సాధించిన ఈ మూవీ అక్టోబర్ 1 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్, కామెడీ, యాక్షన్ కలగలిసిన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Key Points
సాహసం మలయాళం క్రైమ్ కామెడీ మూవీ అక్టోబర్ 1న ఓటీటీలోకి రానుంది.
ఈ చిత్రానికి ఐఎండీబీలో 7.8 రేటింగ్ లభించడం విశేషం.
సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 'సాహసం' స్ట్రీమింగ్ కానుంది.
మూడు కథల సమ్మేళనంగా క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది.
సాహసం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఓటీటీలోకి ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ కామెడీ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా పేరు సాహసం (Sahasam). ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. క్రైమ్ తోపాటు కామెడీ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదు కావడం విశేషం.
మలయాళం క్రైమ్ కామెడీ మూవీ సాహసంను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. దసరాకు ఒక్క రోజు ముందు అంటే బుధవారం (అక్టోబర్ 1) నుంచి ఈ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
మూవీ హైలైట్స్: రేటింగ్, నటీనటులు
“నిజం, దృఢత్వానికి సంబంధించిన స్టోరీలో యాక్షన్ ను కామెడీ కలుస్తుంది. సాహసం మిస్ కావద్దు. సన్ నెక్ట్స్ లో అక్టోబర్ 1న ప్రీమియర్ కానుంది. డోన్ట్ మిస్” అనే క్యాప్షన్ తో సినిమాకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ షేర్ చేసింది.
సాహసం మూవీని బిబిన్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇందులో నరైన్, బాబు ఆంథోనీ, గౌరి కిషన్, రంజాన్ ముహ్మద్, అజు వర్గీస్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం 7.8 రేటింగ్ సాధించింది. ఈ మూవీ మూడు వేర్వురు కథలను చూపిస్తూ వాటన్నింటినీ ఒక్కచోట కలిపి కామెడీతోపాటు యాక్షన్, క్రైమ్ చూపిస్తుంది.
సాహసం సినిమా కథాంశం ఏంటి?
అంతకుముందు ట్వంటీ వన్ గ్రామ్స్ లాంటి థ్రిల్లర్ మూవీ అందించిన బిబిన్ కృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఓవైపు జీవా (రంజాన్), సెరా (గౌరీ) లవ్ స్టోరీతోపాటు ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, వాళ్ల ఆట కట్టించడానికి ప్రయత్నించే ఓ ఆఫీసర్, ముగ్గురు క్యాటరింగ్ వ్యక్తుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూడు కథలను ఎలా కలిపారు? అసలు జరిగిన క్రైమ్ ఏంటన్నది ఈ సాహసం సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాను బుధవారం (అక్టోబర్ 1) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
మొత్తంగా, ‘సాహసం’ మలయాళం క్రైమ్ కామెడీ చిత్రం అక్టోబర్ 1 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 7.8 ఐఎండీబీ రేటింగ్‌తో విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఎంపిక కానుంది.


