
గత నెల థియేటర్లలో విడుదలైన మలయాళ సినిమా లవ్లీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా రాజమౌళి ఈగ సినిమాతో కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది.
Key Points
మలయాళ సినిమా లవ్లీ ఓటీటీలో విడుదల
రాజమౌళి ‘ఈగ’ సినిమాతో కాపీరైట్ వివాదం
డైరెక్టర్ కాపీరైట్ ఆరోపణలను ఖండించారు
లవ్లీ సినిమా ఓటీటీ విడుదల
మలయాళంలో గత నెల థియేటర్లలో రిలీజైన రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ లవ్లీ (Lovely). ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీపై కాపీరైట్ ఆరోపణలు ఉండటం విశేషం. అది కూడా మన ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈగ మూవీ ప్రొడ్యూసర్ చేసినవే. ఆ ఈగనే ఈ మలయాళం ఈగలోనూ అలాగే వాడుకున్నారన్నవి ఆ ఆరోపణలు.
మలయాళం మూవీ లవ్లీ సోమవారం (జూన్ 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 3డీలోనూ సినిమా రిలీజ్ అయింది. ఆ వెర్షన్ చిత్రీకరణ చాలా బాగుందన్న ప్రశంసలు దక్కాయి.
కానీ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఐఎండీబీలోనూ 6.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. తెలుగులోనూ మూవీని రిలీజ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలోకి మాత్రం కేవలం మలయాళం వెర్షనే అందుబాటులోకి వచ్చింది.
రాజమౌళి ‘ఈగ’తో కాపీరైట్ వివాదం
లవ్లీ సినిమా నెగటివ్ రివ్యూల కంటే కాపీరైట్ వివాదంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 2012లో రాజమౌళి తీసిన ఈగ మూవీ మేకర్స్.. ఈ లవ్లీ మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమాలో చూపించిన ఈగ గ్రాఫిక్స్ ఆ ఈగ మూవీ కాపీయే అని ఆరోపించారు. ఈ విషయం కోర్టు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో లవ్లీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతానికి మలయాళం వెర్షన్ అది కూడా 2డీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ లవ్లీని డైరెక్ట్ చేసి దిలీష్ నాయర్ మాత్రం కాపీరైట్ ఆరోపణలను ఖండిస్తున్నాడు. దీనిని నిరూపించడానికి తన దగ్గర టెక్నికల్ ఆధారం కూడా ఉందని అతడు స్పష్టం చేస్తున్నాడు.
సినిమా విజయం, విమర్శలు
దిలీష్ నాయర్ డైరెక్ట్ చేసిన లవ్లీ మూవీలో మాథ్యూ థామస్, శివాంగి కృష్ణకుమార్, మనోజ్ కే జయన్ లీడ్ రోల్స్ లో నటించారు. అనుకోకుండా జైలుకు వెళ్లే ఓ యువకుడికి అక్కడ ఓ మాట్లాడే ఈగ పరిచయం అవుతుంది. వీళ్ల మధ్య బంధం ఎలా బలపడిందనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ లవ్లీ మూవీని తెరకెక్కించారు.
ఇందులోని ఈగను చూసి రాజమౌళి మూవీలోని ఈగనే గుర్తొస్తుంది. దీంతో ఆ గ్రాఫిక్స్ ను కాపీ చేశారనే ఆరోపణలను ఈ మూవీ మేకర్స్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చివరగా, లవ్లీ సినిమా ఓటీటీ విడుదలతో పాటు కాపీరైట్ వివాదం సినిమాకు అదనపు ప్రచారాన్ని తెచ్చింది. ఈ వివాదం కోర్టుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.


