|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!!

Published: 17-02-2026, 1:35 PM
సూర్య పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!!
  • సూర్య 46 మూవీలో సూర్యతో కలిసి నటిస్తున్న మమితా బైజు!
  • సూర్య ప్రత్యేక కాఫీని మమితాకి ప్రతిరోజు అందించిన సూర్య!
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం!
  • 2026 జూలైలో గ్రాండ్ రిలీజ్ కానున్న సూర్య 46!

టాలీవుడ్ లో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్యతో కలిసి మలయాళ నటి మమితా బైజు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సూర్య గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సూర్య 46 మూవీ అప్డేట్స్!

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో మలయాళ తార మమితాబైజు ఒకరు. ‘ప్రేమలు’తో ఒక్కసారిగా ఫేమస్ అయిన మమితా.. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌లో ఆఫర్లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ సూర్యతో ఓ సినిమా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘సూర్య, నేను ‘సూర్య46’ షూటింగ్‌లో చాలా సరదాగా గడిపాం. సూర్య సార్ ఎప్పుడూ స్పెషల్ కాఫీ తాగుతుంటారు. అది చాలా చాలా బాగుంటుంది. నేను ఆయన అసిస్టెంట్లను ఏ కాఫీ తాగుతున్నారో అడిగేదాన్ని. ఒకసారి నేను అడిగడం చూసిన సూర్య షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఆ కాఫీ నేను కూడా తాగేలా చూసుకున్నారు. ఇది చిన్న విషయమే కావచ్చు కానీ నాకు చాలా పెద్ద విషయం’ అని తెలిపింది. కాగా.. సూర్య, మమితా జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్య46’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2026 జూలైలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

మమితా బైజు వైరల్ కామెంట్స్!

సూర్య కాఫీ సీక్రెట్ ఇదేనా?

మమితా బైజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య 46 మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.