
📌 Key Points
- 90లలో మమతా కులకర్ణి బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- అమీర్ ఖాన్ తరచుగా మమతా ఇంటికి వచ్చి, ఆమె బెడ్‌రూమ్‌లో దుస్తులు మార్చుకునేవారు.
- షూటింగ్ తర్వాత అమీర్ ఖాన్ స్వయంగా కిచెన్‌లో టీ తయారు చేసేవారు.
- అప్పటి నటీనటుల మధ్య మతపరమైన భేదాలు లేవని మమతా కులకర్ణి అన్నారు.
90వ దశకంలో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మమతా కులకర్ణి, అమీర్ ఖాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అమీర్ ఖాన్ తమ ఇంటికి వచ్చి వంట కూడా చేసేవారని ఆమె తెలిపారు.
మమతా కులకర్ణి సినీ జీవితం
Mamta Kulkarni: 90 కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మమతా కులకర్ణి ఒకరు.90 లలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎన్నో వివాదాలలో కూడా నిలిచారు. వివాదాస్పద నటిగా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె ఉన్నఫలంగా దేశం వదిలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె సన్యాసిగా మారి కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు.
ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మతతత్వం గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై కామెంట్లు చేశారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి మత భేదాభిప్రాయాలు లేవని తెలిపారు. ఒకప్పుడు నేను షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ (Aamir Khan)వంటి వారితో కూడా సినిమాలు చేశానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె అమీర్ ఖాన్ గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మమతా కులకర్ణి పలు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో బాజీ సినిమా(Bazzi Movie) ఒకటి.
అమీర్ ఖాన్‌తో అనుభవాలు పంచుకున్న మమతా
ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలను ఈమె అభిమానులతో పంచుకున్నారు. అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్లతో నేను ఎన్నో సినిమాలలో నటించాను. ఇక అమీర్ ఖాన్ తో కలిసి నటించిన భాజీ సినిమా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ నిత్యం మా ఇంటికి వచ్చి నా బెడ్ రూమ్ లోకి వెళ్లి తన దుస్తులు మార్చుకొని అక్కడే రెడీ అయి షూటింగ్ కు వెళ్లిపోయేవారని తెలిపారు. ప్రస్తుతం ఉన్నట్టు అప్పట్లో కేరవాన్లు లేకపోవడంతో ఆయన తరచూ మా ఇంటికి వచ్చేవారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తిరిగి అమీర్ ఖాన్ మా ఇంటికి వచ్చి ఆయనే మా కిచెన్ లోకి వెళ్లి మా కోసం టీ కూడా పెట్టేవారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
90 లలో నటీనటుల మధ్య ఎలాంటి మత భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో చక్కగా కలిసిపోయి సినిమాలలో నటించే వాళ్ళం అలాగే సినిమాలు మాత్రమే కాకుండా విదేశీ పర్యటనలకు కూడా కలిసి వెళ్లే వాళ్ళమని, అక్కడ అందరూ ఒకే చోట ఉండే వాళ్ళం అంటూ అప్పటి పరిస్థితులను తెలిపారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు పూర్తిగా కనుమరుగైపోయాయని, దయచేసి సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఇలాంటి వివక్షతను తీసుకురావద్దు అంటూ మమతా కులకర్ణి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూనే అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి హీరోలతో తనకున్నటువంటి అనుబంధం గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నాటి సినీ పరిశ్రమ పరిస్థితులు
మమతా కులకర్ణి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి నటీనటుల మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


