|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ జాతర షురూ! బాలయ్య లైఫ్ టైమ్ కలెక్షన్స్‌కి చిరు ఒక్కడే చెక్ పెట్టాడు.. రికార్డులు బ్రేక్!

Published: 15-01-2026, 2:00 AM
మాస్ జాతర షురూ! బాలయ్య లైఫ్ టైమ్ కలెక్షన్స్‌కి చిరు ఒక్కడే చెక్ పెట్టాడు.. రికార్డులు బ్రేక్!
  • చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ: 3 రోజుల్లో రూ.152 కోట్ల భారీ వసూళ్లు!
  • బాలయ్య సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన మెగాస్టార్ మూవీ రికార్డ్స్!
  • అనిల్ రావిపూడి దర్శకత్వం, వెంకటేష్ స్పెషల్ రోల్, నయనతార హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్ హిట్!
  • సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సత్తా చాటారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మూడు రోజుల్లో చిరు మూవీ వసూళ్ల సునామీ!

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. వెంకటేష్‌ ఇందులో స్పెషల్‌ రోల్‌ చేయగా, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జనవరి 12న విడుదలై ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు బ్లాక్‌ బస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది.

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ మూడు రోజుల్లో భారీ వసూళ్లని రాబట్టింది. అంతేకాదు థియేటర్లో హోల్డ్ అయ్యింది. సాధారణంగా మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు తగ్గిపోతాయి. మూడో రోజు మరింత తగ్గుతాయి. కానీ మూవీ మూడో రోజు కూడా స్టడీగా ఉన్నాయి. ఇదే మూవీ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.152 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.

బాలయ్య రికార్డులను బ్రేక్ చేసిన మెగాస్టార్!

మొదటి రోజుఈ చిత్రానికి రూ.84కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.36కోట్లు రాగా, మూడో రోజు రూ.32 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రూ.152కోట్లు కావడం విశేషం. ఈ మూవీకి సుమారు రూ.140 కోట్ల వ్యాపారం జరిగింది.  దాదాపు రూ.250 కోట్లు వస్తే ఇది బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇప్పటికే ఇది అరవై శాతం వసూళ్లని రాబట్టింది. ఇంకా నాలుగు రోజులు ఈ చిత్రానికి తిరుగులేదు. దీంతో ఈ ఆదివారం వరకు బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుంటుందని చెప్పొచ్చు. ఈ మూవీ లాంగ్‌ రన్‌లో మూడు వందల కోట్లు దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సరికొత్త సంచలనంగా మారింది. బాలయ్య మూవీస్‌ లైఫ్‌ టైమ్‌ వసూళ్లని బ్రేక్‌ చేసింది. బాలకృష్ణ నటించిన ఏ మూవీ కూడా రూ.150కోట్లు దాటలేదు. `అఖండ`, `అఖండ 2`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకుమహారాజ్‌` ఇలా అన్ని సినిమాలు వంద కోట్లు దాటాయి. కానీ ఏది రూ.150 దాటలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య సినిమాల లైఫ్‌ టైమ్‌ వసూళ్లని మూడు రోజుల్లోనే `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ బ్రేక్‌ చేయడం విశేషం. ఇదిప్పుడు మెగా అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తే, నందమూరి అభిమానులను జీర్ణించుకోనివ్వడం లేదు.

అనిల్ రావిపూడి మ్యాజిక్.. బాక్సాఫీస్ బద్దలు!

బాలయ్య నటించిన టాప్ 5 మూవీస్‌ కలెక్షన్లు చూస్తే `డాకు మహారాజ్‌` రూ.133కోట్లు, `అఖండ` రూ.125కోట్లు, `వీరసింహారెడ్డి` రూ.122 కోట్లు, `భగవంత్‌ కేసరి` 113కోట్లు రాబట్టగా, ఇటీవల వచ్చిన `అఖండ 2` రూ.128కోట్లు వసూళు చేసింది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఎన్బీకే 111 పేరుతో ఇది తెరకెక్కనుంది. కానీ బడ్జెట్‌ కారణంగా ఆగిపోయింది.

చిరంజీవి గారి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మెగా అభిమానులకు పండగే పండగ!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.