|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను

Published: 07-12-2025, 1:08 PM
Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తున్నారు.
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • గతంలో అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయడంలో ఆలస్యం జరిగింది.
  • మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఓపిక ఉందని అనిల్ రావిపూడి ప్రశంసించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిగారితో సినిమా చేయలేకపోయిన గత అనుభవాలను పంచుకుంటూ, ఆయన ఓపికను కొనియాడారు.

సినిమా విడుదల, పాటల విశేషాలు

Mana Shankara Vara Prasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల అనే పాట దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ కూడా నేడు విడుదల చేశారు. శశిరేఖ అనే పాట ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలలో అంతమందికి నిజం కావు. పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయాలి అని ప్రయత్నాలు చేశారు. అవి జరిగినట్లే జరిగి మధ్యలోనే ఆగిపోయాయి. పూరి జగన్నాథ్ విషయానికొస్తే రెండు మూడు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మొదలుపెట్టలేదు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకత్వం వహించే అవకాశం వస్తుంది అంటే చాలామంది ముందుకు వస్తారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంటే ముందు ఒక కథను మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్లాట్ ఖాళీగా లేకపోవడం వలన చెప్పా పెట్టకుండా తప్పుకున్నాడు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ కథ

అయితే కొన్ని రోజులు తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేద్దాం అని అనిల్ రావిపూడి అడిగారట. వెంటనే మనసులో ఏది పెట్టుకోకుండా చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదలుపెట్టాడు అనిల్ రావిపూడి.

నేను సాధారణంగా నాకు మాత్రమే ఓపిక ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాను. కానీ నాకంటే కూడా విపరీతమైన ఓపిక మెగాస్టార్ చిరంజీవికి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కేవలం మన అనుకున్న వాళ్ళతో మాత్రమే కాకుండా అందరితో కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతారు.

చిరంజీవి ఓపికపై అనిల్ వ్యాఖ్యలు

ఆయనకు ఉన్న ఓపిక చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది అంటూ అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమా వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుస్తుంది. గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా పండుగ సీజన్ లోనే మంచి సక్సెస్ సాధించింది.

మొత్తానికి, ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కూడా భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.