|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మనసును మార్చే మాటలు.. ఓటీటీలోకి లవ్ స్టోరీ.. దొరికిన ప్రేమలేఖ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published: 06-08-2025, 2:48 AM
మనసును మార్చే మాటలు.. ఓటీటీలోకి లవ్ స్టోరీ.. దొరికిన ప్రేమలేఖ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ప్రతి ఆదివారం కొత్త షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం అవుతున్నాయి. ‘కథా సుధ’ పేరుతో వస్తున్న ఈ సిరీస్ లో తాజాగా ‘దొరికిన ప్రేమలేఖ’ అనే లవ్ స్టోరీ ఆగస్టు 10న విడుదల కానుంది.

Key Points

1

ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కొత్త షార్ట్ ఫిల్మ్స్.

2

ఆగస్టు 10న 'దొరికిన ప్రేమలేఖ' షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.

4

రాఘవేంద్రరావు, సతీశ్ వేగేశ్న వంటి దర్శకులతో పాటు యువ దర్శకుల సినిమాలు.

ఈటీవీ విన్ ఓటీటీలో కొత్త షార్ట్ ఫిల్మ్

ఈటీవీ విన్ ఓటీటీ వారం వారం కొత్త షార్ట్ ఫిల్మ్స్ తో డిజిటల్ ఆడియన్స్ ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. లవ్, ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలు ప్రతి ఆదివారం అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరో హార్ట్ టచింగ్ స్టోరీ ఈటీవీ విన్ లోకి వచ్చేస్తోంది. లవ్ స్టోరీగా ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది.

కథా సుధ పేరుతో ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ ఫిల్మ్ ను ఆడియన్స్ కు అందిస్తుంది. వచ్చే ఆదివారం (ఆగస్టు 10) మరో కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ‘దొరికిన ప్రేమలేఖ’ అంటూ ఈటీవీ విన్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ ఫిల్మ్ వస్తుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

‘దొరికిన ప్రేమలేఖ’ విడుదల తేదీ

‘‘ఒక లేఖ.. అంతులేని భావోద్వేగాలు. అన్నింటినీ మార్చే మాటలు, ప్రేమ, దూరం కలగలిసిన కథ. కథా సుధ నుంచి దొరికిన ప్రేమలేఖ ఆగస్టు 10న ఈటీవీ విన్ లో ప్రీమియర్ కానుంది’’ అని ఈటీవీ విన్ ఓటీటీ పోస్టు చేసింది.

కథా సుధ పేరుతో ప్రతి ఆదివారం ఈటీవీ విన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 6 నుంచి ప్రతి సండే ఒక్క ఫిల్మ్ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తోంది. ఉత్తరం, లైఫ్ పార్ట్ నర్, లవ్యూ నానమ్మ, వెండీ పట్టీలు, ట్రింగ్ ట్రింగ్, పెంకుటిల్లు, సుందరం గాడి ప్రేమకథ, కాలింగ్ బెల్, నాతి చరామి, అమృత‌వ‌ల్లి, డియర్ డాడీ, ప్రేమంటే ఇది కదా, ఏవి.. అలనాటి ముద్దులు, నగుమోము కనలేని, మేమిద్దరం, థాంక్యూ యూ నాన్న.. ఇలా వరుసగా షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి.

‘కథా సుధ’ సిరీస్ విశేషాలు

గత సండే థాంక్యూ యూ నాన్న ఈటీవీ విన్ లోకి వచ్చింది. తండ్రీ, కూతురు మధ్య హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫిల్మ్ ఆడియన్స్ ను అలరించింది. ఈ కథ సుధా సిరీస్ లో మొదటి కొన్ని షార్ట్ ఫిల్మ్ లకు దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు, శతమానం భవతి దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో యువ డైరెక్టర్లను పరిచయం చేస్తోంది ఈటీవీ విన్. డ్రామా, రొమాన్స్, ఫ్యామిలీ, రొమాంటిక్ కామెడీ తదితర జోనర్లలో కథా సుధ సిరీస్ లో షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి.

అలా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రేక్షకులను అలరించే కొత్త షార్ట్ ఫిల్మ్స్ వరుసగా వస్తున్నాయి. ‘దొరికిన ప్రేమలేఖ’ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.