|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పుష్ప డైలాగ్ నాదే! బాంబ్ పేల్చిన మంచు లక్ష్మి! అసలేం జరిగిందంటే?

Published: 10-03-2026, 3:05 AM
పుష్ప డైలాగ్ నాదే! బాంబ్ పేల్చిన మంచు లక్ష్మి! అసలేం జరిగిందంటే?
  • పుష్ప సినిమాలో ‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్’ డైలాగ్ తనదేనని మంచు లక్ష్మి అన్నారు.
  • ‘లేచింది మహిళా లోకం’ సినిమా షూటింగ్ పుష్ప కంటే ముందే పూర్తయిందని ఆమె తెలిపారు.
  • లేచింది మహిళా లోకం సినిమాలో మంచు లక్ష్మి పాత్ర పేరు పుష్ప కావడం విశేషం.
  • మార్చి 26న ‘లేచింది మహిళా లోకం’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మంచు లక్ష్మి తాజాగా పుష్ప సినిమాలోని డైలాగ్ తనదేనని చెప్పి సంచలనం సృష్టించారు. ‘లేచింది మహిళా లోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

పుష్ప డైలాగ్ పై మంచు లక్ష్మి కామెంట్స్

Manchu Lakshmi:మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మధ్యకాలంలో అటు లేడి ఓరియంటెడ్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘లేచింది మహిళా లోకం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి ‘పుష్ప’ సినిమాలో డైలాగ్ నాదే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

లేచింది మహిళా లోకం సినిమాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు లక్ష్మీ మాట్లాడుతూ..” ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర పేరు కూడా పుష్ప కావడం విశేషం. దర్శకుడు సుకుమార్ కి నేనొక విషయం చెప్పాలి. “పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్” అని ముందు నేనే చెప్పానండీ. మా సినిమా షూటింగ్ పుష్ప కంటే ముందే పూర్తయింది. కానీ అప్పటికి మా డైలాగ్ బయటకు రాలేదు. పుష్ప టీజర్ లో ఆ డైలాగు వినగానే.. అరే ఇది నా డైలాగ్ కదా అని చాలా ఫీలయ్యాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

లేచింది మహిళా లోకం సినిమా విశేషాలు

లేచింది మహిళా లోకం సినిమా విషయానికి వస్తే.. అనన్య నాగళ్ళ , శ్రద్ధాదాస్, హరితేజ, హేమ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇకపోతే సినిమా నిర్మాణంపై కూడా ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి సినిమాలను నిర్మించే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు. మొత్తానికైతే పుష్ప సినిమాలో డైలాగ్ తనదేనంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

సినిమా నిర్మాణంపై మంచు లక్ష్మి స్పందన

ఇకపోతే ఇదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు లక్ష్మి మాట్లాడుతూ..” మేము చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమా చేశామన్నమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని నేను కూడా అనుకోలేదు. ఒక రేంజ్ లో రెచ్చిపోయాను. కొన్ని డైలాగ్ లు ఉండవని అనుకున్నాను. కానీ అన్నీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్టులని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో.. మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు ఈ సినిమా చూడకపోయినా పర్వాలేదు “అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది మంచు లక్ష్మి. ఇంకా మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత ఒక కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను అని చెప్పిన ఈమె . ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి పుష్ప సినిమాలోని డైలాగ్ తనదేనని చెప్పడం ద్వారా మంచు లక్ష్మి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.