|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీనియర్ జర్నలిస్ట్‌పై మంచు లక్ష్మి ఫిర్యాదు.. బహిరంగ క్షమాపణ కోరిన నటి.. ఫిర్యాదులో ఇంకా ఏం చెప్పిందంటే?

Published: 22-09-2025, 12:48 AM
సీనియర్ జర్నలిస్ట్‌పై మంచు లక్ష్మి ఫిర్యాదు.. బహిరంగ క్షమాపణ కోరిన నటి.. ఫిర్యాదులో ఇంకా ఏం చెప్పిందంటే?

మంచు లక్ష్మి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ పై ఫిర్యాదు చేసింది. ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’ సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె అవమానాలకు గురైందని ఆరోపించింది. ఫిర్యాదులో ఆమె వివరించిన విషయాలు ఇవే…

Key Points

1

సీనియర్ జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూలో మంచు లక్ష్మికి జరిగిన అవమానకర అనుభవం.

2

వ్యక్తిగత విషయాలపై అనుచిత ప్రశ్నలు అడిగినందుకు జర్నలిస్ట్ పై ఫిర్యాదు.

4

స్త్రీల భద్రత, గౌరవం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని మంచు లక్ష్మి విజ్ఞప్తి.

ఇంటర్వ్యూలో జరిగిన వివాదం

మంచు కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ హీరోయిన్‌గా, విలన్‌ గా అలరించింది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నిలిస్ట్ మంచు లక్ష్మిని అడిగిన ప్రశ్నలు వివాదం అయిన విషయం తెలిసిందే.

ఆ ఇంటర్వ్యూలో అప్పుడే ఆ సీనియర్ జర్నలిస్ట్‌కు మంచు లక్ష్మి నైస్‌గా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. అయితే, తాజాగా సదరు జర్నలిస్ట్‌పై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో మంచు లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

“భారతదేశం స్త్రీలను శక్తిగా ఆరాధించే దేశం. అయితే ప్రొఫెషనల్‌గా కొన్ని స్థలాలకు వెళ్లినప్పుడు మాత్రం స్త్రీలపై ద్వేషం, వారిని అవమానించడం, అగౌరవంగా మాట్లాడటం వంటివి జరుగుతున్నాయి. ఇది కొనసాగకూడదు. నాకే కాదు, ఎవరికి ఇలా జరగకూడదు. నన్ను ఆదర్శంగా తీసుకుని అనేక యువతులు ఇలాంటి వాటిని బయటపెట్టాలి” అని మంచు లక్ష్మీ అన్నారు.

ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు

“నాలుగు సంవత్సరాల తర్వాత నేను నిర్మించిన మూవీతో కాకుండా నా తండ్రి మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తున్న సందర్భంలో మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ, దురదృష్టవతశాత్తు ఆ ఇంటర్వ్యూ వ్యక్తిగత దాడిగా మారింది” అని ఫిర్యాదులో మంచు లక్ష్మి పేర్కొన్నారు.

“అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి వ్యక్తిగతంగా నన్ను అవమాన పరిచే విధంగా ప్రవర్తించాడు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు” అని మంచు లక్ష్మి రాసినట్లు సమాచారం.

“నాకు జర్నలిజం పట్ల గౌరవం ఉంది. నిజాయితీతో చేసే జర్నలిజం సమాజానికి సమాచారం, మార్పు, ప్రేరణ కలిగిస్తుంది. అయితే, వృత్తిని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి వైరల్ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం” అని మంచు లక్ష్మి చెప్పారు.

స్త్రీల భద్రతపై ఆందోళన

“ఇది వృత్తిపరమైనదే కాకుండా మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి, ఫిల్మ్ చాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మేము (మహిళలు) ఎదుర్కునే ఇలాంటి ప్రశ్నలు, అవమానాలను ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ఫిర్యాదులో మంచు లక్ష్మి కోరారు.

అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ తనకు బహిరంగం క్షమాపణలు చెప్పాలని, ఇలాంటి ప్రశ్నలు మరోసారి వేయకుండా ఫిల్మ్ చాంబర్ చర్యలు చేపట్టాలని మంచు లక్ష్మి డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా, “50 ఏళ్లకు దగ్గరిగా, పిల్లలకు తల్లిగా ఉంటున్న మీరు ఇలాంటి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు” అని మంచు లక్ష్మిని జర్నలిస్ట్ అడిగిన విషయం తెలిసిందే.

మంచు లక్ష్మి చేసిన ఫిర్యాదు తెలుగు సినిమా పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చను రేకెత్తిస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.