|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Lakshmi: మా ఇంట్లో దొంగతనం జరిగితే సైలెంట్‌గా.. అసభ్యంగా తాకాడు!

Published: 16-11-2025, 2:14 AM
Manchu Lakshmi: మా ఇంట్లో దొంగతనం జరిగితే సైలెంట్‌గా.. అసభ్యంగా తాకాడు!

నటి మంచు లక్ష్మి తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ఇటీవల వెల్లడించారు. పదిహేనేళ్ల వయసులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అసభ్యంగా తాకబడటం, ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Key Points

1

మంచు లక్ష్మి తన 15వ ఏట పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అసభ్యంగా తాకబడిన అనుభవాన్ని పంచుకుంది.

2

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని స్నేహితులకు చెప్పి ఏడ్చినట్లు వెల్లడించారు.

4

ఇంట్లో దొంగతనం జరిగినా బయట చెప్పలేక మౌనంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.

పదిహేనేళ్ల వయసులో చేదు అనుభవం

పదిహేనేళ్ల వయసులో తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది నటి మంచు లక్ష్మి ( Lakshmi Manchu ). తాజాగా హాటర్‌ఫ్లైకిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా.. నాకు 15 ఏళ్లు. నేనెప్పుడూ కారులోనే స్కూలుకు వెళ్లేదాన్ని. నా వెంట మా అమ్మ, డ్రైవర్‌, బాడీగార్డ్‌ ఉండేవాళ్లు.

అసభ్యంగా తాకాడు ఓసారి స్కూల్‌ వాళ్లు మమ్మల్ని హాల్‌ టికెట్స్‌ తీసుకునేందుకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్లారు. అప్పుడు నేను చాలా ఎగ్జయిటయ్యాను. కానీ, దారిలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. నాకు చాలా చెత్తగా అనిపించింది. నేను చిన్నపిల్లని అన్న విషయం వారికి తెలుసా? లేదా? అర్థం కాలేదు. అతడితో నేను గొడవపెట్టుకోలేక అక్కడి నుంచి పక్కకు జరిగాను. తర్వాత జరిగింది నా ఫ్రెండ్స్‌కు చెప్పాను.

అసభ్యంగా తాకబడిన సంఘటన

ఎంతో ఏడ్చా.. వాళ్లు అలాంటి సంఘటనలు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పేసరికి షాకయ్యాను. ఇక్కడ నేను మోహన్‌బాబు కూతుర్ని అని నన్ను స్పెషల్‌గా చూడలేదు. ఇలాంటి చేదు అనుభవాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. కానీ, చాలామంది తమకలాంటి అనుభవాలు ఎదురవలేదని అబద్ధం చెప్తుంటారు. మీటూ ఉద్యమం సమయంలో అయితే కిందపడి ఏడ్చిన రోజులున్నాయి. మీటూ సమయంలో ఆడవాళ్లు ఎదుర్కొన్న ఎన్నో బాధల్ని బయటకు చెప్పారు.

ఇంట్లో దొంగతనం అవి నేనూ ఫేస్‌ చేసినందున వాటిని తల్చుకుని కుమిలిపోయాను. పెద్ద కుటుంబం నుంచి వచ్చానని తెలిసి కొందరు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎందుకంటే అందరిలాగా మేము బయటకు వచ్చి అన్నీ చెప్పలేం కాబట్టి! ఒకసారి మా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నేను బయటకు చెప్పుకోలేకపోయా! రూ.15 వేలే కదా.. పోనీలే అని వదిలేశా.. మమ్మల్ని అలాగే పెంచారు అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ మంచు చివరగా ‘దక్ష’ సినిమాలో కనిపించింది.

ఇంట్లో దొంగతనం: వెల్లడించిన మంచు లక్ష్మి

మంచు లక్ష్మి తన చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా సమాజంలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలియజేస్తున్నారు. ఆమె ధైర్యం అనేకమందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.