|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Manoj: ‘నా జీవితంలో ఎల్లప్పుడు ఆదర్శం నువ్వే అక్కా’.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్

Published: 08-10-2025, 3:23 PM
Manchu Manoj: 'నా జీవితంలో ఎల్లప్పుడు ఆదర్శం నువ్వే అక్కా'.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్

హీరో మంచు మనోజ్ తన సోదరి, నటి మంచు లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మి తన జీవితానికి ఎల్లప్పుడూ ఆదర్శమని, ఆమె కృషి అద్భుతమని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారి బంధం, మనోజ్ ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ చిత్రం విజయం చర్చనీయాంశమయ్యాయి.

Key Points

1

హీరో మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2

మంచు లక్ష్మిని తన జీవితానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా పేర్కొన్నారు.

4

మనోజ్ నటించిన 'మిరాయ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

మంచు లక్ష్మికి మనోజ్ ఎమోషనల్ విషెస్

టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు , హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు . ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు . నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి .. నీ దయ , బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు .

ఆదర్శం అక్కా.. మంచు మనోజ్ ప్రశంసలు

ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి .. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు . నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు . ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు .

మంచు మనోజ్ లేటెస్ట్ సినిమా విజయం

ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం , మిరాయ్ చిత్రాలతో అలరించాడు . ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ ‌ హిట్ ‌ గా నిలిచింది . తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ‌ సాధించింది .

మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పట్ల తన ప్రేమ, గౌరవం చాటుకున్నారు. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన విజయాలను స్పృశిస్తూ, ఈ శుభాకాంక్షలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.