
మంచు విష్ణు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా VFX పనుల్లో తలెత్తిన సమస్యల గురించి విష్ణు తాజాగా వెల్లడించారు. VFX సూపర్‌వైజర్ తప్పు వల్ల సినిమాకు 10 నుంచి 15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
Key Points
కన్నప్ప సినిమా VFX పనిలో 10-15 కోట్లు వృథా అయ్యాయి.
VFX సూపర్వైజర్ తప్పు వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అయింది.
మంచు విష్ణు VFX లో తన తప్పును అంగీకరించాడు.
మోహన్ బాబు యూనివర్సిటీలో VFX కోర్సు ప్రారంభించబోతున్నాడు.
కన్నప్ప సినిమా VFX సమస్యలు
Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా జూన్ 27 రిలీజ్ కానుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంది అని ఇప్పటికే విష్ణు తెలిపారు.
తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు VFX విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపాడు.
15 కోట్ల రూపాయల నష్టం
మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు ఒక అసమర్దుడిని VFX సూపర్ వైజర్ గా పెట్టుకున్నాను. నేను చేసిన తప్పు అదే. అతను చేసిన తప్పు వల్ల సినిమా సంవత్సరం ఆలస్యం అయింది. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. VFX సమస్యలు, VFX కంపెనీల గురించి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. అతన్ని పెట్టుకోవడం వల్ల కన్నప్ప సినిమాకు విఎఫ్ఎక్స్ విషయంలో దాదాపు 10 నుంచి 15 కోట్లు వేస్ట్ అయింది. అంత కాస్ట్లీ తప్పు జరిగింది.
మోహన్ బాబు యూనివర్సిటీలో VFX కోర్సు
అందుకే ఈ సంవత్సరం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో విఎఫ్ఎక్స్ కోర్స్ 3 ఇయర్స్ డిగ్రీ మొదలు పెడుతున్నాం. మూడేళ్ళలో మా కాంపౌండ్ నుంచే VFX టీమ్, సూపర్ వైజర్స్ ని రెడీ చేయాలి అన్నదే నా లక్ష్యం అని తెలిపారు.
కన్నప్ప సినిమా VFX పనులలో ఎదురైన నష్టాన్ని గుర్తించిన మంచు విష్ణు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి మోహన్ బాబు యూనివర్సిటీలో VFX కోర్సును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది సినీ రంగం కోసం ఒక మంచి అడుగు.


