|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manoj Manchu: కన్నప్ప.. నేను అనుకున్నదానికంటే వెయ్యిరెట్లు బాగుంది

Published: 27-06-2025, 3:55 AM
Manoj Manchu: కన్నప్ప.. నేను అనుకున్నదానికంటే వెయ్యిరెట్లు బాగుంది

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. మంచు మనోజ్ ఈ సినిమాను ఐమాక్స్‌లో వీక్షించి, సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Key Points

1

మంచు మనోజ్ కన్నప్ప సినిమాను ఐమాక్స్‌లో వీక్షించారు.

2

విష్ణు యొక్క నటనను మనోజ్‌ ప్రశంసించారు.

4

సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మనోజ్ కన్నప్పను వీక్షించారు

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప ( Kannappa Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చిత్రానికి పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27న) కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు మంచు మనోజ్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో వీక్షించాడు. ఈ సందర్భంగా అతడు సినిమా బాగుందని మెచ్చుకున్నాడు. మనోజ్‌ మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను. చాలా చాలా బాగుంది. ప్రభాస్‌ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్తుంది. క్లైమాక్స్‌లో (విష్ణు) ఇంత గొప్ప పర్ఫామెన్స్‌ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు.

విష్ణు, మోహన్ బాబు నటనపై ప్రశంసలు

వెయ్యి రెట్లు బాగుంది అందరూ చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే వెయ్యి రెట్లు బాగుంది. చిత్రయూనిట్‌ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని, మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సినిమా ప్రారంభంలో ఐదు నిమిషాలు మిస్సయ్యాను. దానికోసం కన్నప్ప సినిమాను మరోసారి చూస్తాను అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు. కానీ అన్న పేరును మాత్రం ప్రస్తావించలేదు. మరో వీడియోలో మాత్రం ‘చివరి 20 నిమిషాలైతే అదిరిపోయింది. అన్న (విష్ణు) కూడా ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. నాన్న (మోహన్‌బాబు) యాక్టింగ్‌ గరించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టాడు. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు.

సినిమా విజయం కోసం ఆకాంక్షలు

చివరగా, మంచు మనోజ్ తన సోదరుడు విష్ణు మరియు తండ్రి మోహన్ బాబు నటనను ప్రశంసించి, కన్నప్ప సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.