
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విరాజ్ అశ్విన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘బేబీ’ సినిమాతో సెకండ్ హీరోగా భారీ క్రేజ్ సంపాదించుకున్న విరాజ్, ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, రెజీనాలతో కలిసి ఒక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘మరీచిక’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తుండగా.. చిలక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విరాజ్, రెజీనా, అనుపమ ముగ్గురూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు జడలకు పువ్వులు పెట్టుకుని, పల్లసెట్ ధరించి, లంగా జాకెట్‌లో పక్కా పల్లెటూరి అమ్మాయిలా అనుపమ మెస్మరైజ్ చేస్తోంది. కేవలం పోస్టర్‌తోనే కాకుండా, చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. “ప్రేమ, అబద్ధాలు, ప్రతీకారంతో కూడిన ఒక వెంటాడే కథను వీక్షించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. అంటే ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు ఊహించని ట్విస్టులు, రివెంజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. విరాజ్ అశ్విన్ తన నటనతో మరోసారి మెప్పించడానికి సిద్ధమవుతుండగా, రెజీనా, అనుపమల పాత్రలు ఈ కథను ఏ మలుపు తిప్పుతాయో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


