
📌 Key Points
- మావోయిస్టు హిడ్మా, రాజేల AI చిత్రాలకు పాటలు, డైలాగులు జత చేసి వైరల్ చేస్తున్నారు.
- గత ఏడాది మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా, రాజే హతం.
- బస్తర్ జిల్లాలో హిడ్మా పేరుతో డీజే పాట వైరల్ అవ్వడంపై పోలీసుల హెచ్చరికలు.
- హతమైన మావోయిస్టుల ఫోటోలకు పాటలు జోడించిన క్లిప్పింగ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
గత ఏడాది ఎన్‌కౌంటర్ అయిన మావోయిస్టు నేతలు హిడ్మా, రాజేలకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి చిత్రాలతో కూడిన AI వీడియోలను రూపొందించి, వాటికి పాటలు జత చేసి ట్రెండింగ్ చేస్తున్నారు.
ఎన్‌కౌంటర్ అయిన మావోయిస్టుల పాటల వైరల్
మారేడుమిల్లి అడవుల్లో గతేడాది నవంబర్ లో ఏపీ పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు పార్టీ గెరిల్లా దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఆయన భార్య రాజే ఫోటోలు పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. హిడ్మా, రాజేలు ఇద్దరు కలిసి అడవుల్లో ఉన్నట్లు, వారు గిరిజనులతో మాట్లాడుతూ వారికి జంగల్ రక్షించుకోవడానికి శిక్షణ ఇస్తున్నట్లు ఏఐ తో క్రియేట్ చేసిన వీడియోలకు సినిమా పాటలు, డైలాగులు జోడించి వైరల్ చేస్తున్నారు. కాగా గత నెలలో ఛత్తీస్‍గఢ్‍లోని బస్తర్ జిల్లా (Bastar) జగదల్ పూర్‍లో జరిగిన భూంకాల్ 116 వార్షికోత్సవం ర్యాలీలో ఆయన పేరుతో సాగే ఓ పాట డీజే వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ ర్యాలీలో హిడ్మా పేరుతో ఉన్న ఓ డీజే వెర్షన్ పాటను స్పీకర్లలో ప్లే చేశారు. ఇలాంటి పాటలపై అప్పట్లో పోలీసులు సైతం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. కానీ హతమైన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోలకు పాటలు జోడించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.
హిడ్మా, రాజేలకు నివాళిగా AI వీడియోలు
పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
హతమైన మావోయిస్టులకు సంబంధించిన పాటలు, వీడియోలు వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు హెచ్చరించినప్పటికీ, సోషల్ మీడియాలో ఇటువంటి కంటెంట్ వ్యాప్తి ఆగడం లేదు.


