
📌 Key Points
- ‘దేవూల్ బంద్ 2’ చిత్రం కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.
- విడుదలైన 9 రోజుల్లోనే రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
- మొదట 1100 స్క్రీన్లలో విడుదలై, ప్రేక్షకుల డిమాండ్‌తో అదనంగా 600 స్క్రీన్లు పెరిగాయి.
- ఈ చిత్రం మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల జాబితాలో చేరింది.
మరాఠీ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘దేవూల్ బంద్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన 9 రోజుల్లోనే రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంతీయ సినిమాల సత్తాను చాటుతూ భారీ విజయం సాధించింది.
దేవూల్ బంద్ 2: కలెక్షన్ల సునామీ
Deool Band2: సూపర్ హిట్స్, సాలిడ్ కలెక్షన్స్ అంటే బాలీవుడ్ లేదా టాలీవుడ్, కలిసివస్తే సాండల్ వుడ్ ఇండస్ట్రీల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి.కానీ ఈ మధ్య ఎవరూ ఊహించని రీతిలో గుజరాతీ, మరాఠీ ల ఇండస్ట్రీలు తామూ బరిలోనే ఉన్నామంటూ మీసం మెలేస్తున్నాయి.
అవును …గత కొన్ని నెలల కింద గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘లాలో కృష్ణ సదాయతే ’ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఎంతటి భారీ వసూళ్లను సాధించిందో మనకందరికీ తెల్సిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తుంది మరాఠీ సినీ ఇండస్ట్రీ.ఈ క్రమంలో చిన్నబడ్జెట్ లో వచ్చి హై వాల్యూమ్ కలెక్షన్లను సాధిస్తున్న తాజా మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ (Deool Band 2) ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, కేవలం తొమ్మిది రోజుల్లోనే సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికి పెద్ద షాకే ఇచ్చింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్నేహల్ తార్డే, సీనియర్ నటుడు మోహన్ జోషి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
మరాఠీ సినిమాకు కొత్త ఊపు
ఇండోర్ సెట్ కావడంతో సమయం తెలియలేదని, మధ్యలో జూనియర్ ఆర్టిస్టులుగా వచ్చిన గ్రామస్థులు వెళ్ళిపోతే, దర్శకుడి స్నేహితులు, కార్ డ్రైవర్లకు కాస్ట్యూమ్స్ వేసి మరీ షూటింగ్ పూర్తి చేశామని నటి స్నేహల్ తార్డే పేర్కొన్నారు. ఈ కష్టమే ఇప్పుడు సినిమాను ఇంతటి సూపర్ హిట్ కారణం అంటున్నారంతా.చూడాలి మరి 40కోట్లని దాటేసి దూసుకెళ్తున్న ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో !
కథాంశం, నటీనటులు
మొత్తంమీద, ‘దేవూల్ బంద్ 2’ మరాఠీ సినిమాకు కొత్త దిశను చూపింది. చిన్న బడ్జెట్‌తో కూడా అద్భుతమైన కంటెంట్‌తో భారీ విజయాలు సాధించవచ్చని నిరూపించింది. ఈ సినిమా విజయం ఇతర ప్రాంతీయ చిత్రాలకు స్ఫూర్తినిస్తుంది.


