|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిల్ రాజు సృష్టిస్తున్న ‘మార్కండేయ’ విశ్వం! ఇది మామూలు స్కెచ్ కాదుగా!!

Published: 12-02-2026, 2:05 PM
దిల్ రాజు సృష్టిస్తున్న 'మార్కండేయ' విశ్వం! ఇది మామూలు స్కెచ్ కాదుగా!!
  • దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌పై విక్రాంత్‌తో ‘మార్కండేయ’ చిత్రం నిర్మాణం.
  • ఇది మైథలాజికల్ థ్రిల్లర్‌గా సిస్ట్లా వీఎంకే దర్శకత్వంలో రూపొందుతోంది.
  • పురాణాలలోని అనంత కోటి బ్రహ్మాండాల కాన్సెప్ట్‌తో ఆధునిక కథనం.
  • దిల్ రాజు మార్గదర్శకత్వంలో సీజీ వర్క్ అధికంగా ఉంటుందని హీరో విక్రాంత్ తెలిపారు.

హాలీవుడ్ తరహాలో దిల్ రాజు కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన నిర్మిస్తున్న ‘మార్కండేయ’ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ వేడుకలో హీరో చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

దిల్ రాజు డ్రీమ్స్‌తో ‘మార్కండేయ’

Markandeya: హాలీవుడ్, బాలీవుడ్, సౌత్‌లో ఎక్కడ విన్నా యూనివర్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. లొకేష్ కనగరాజ్, సుజీత్ ఇలా యూనివర్స్‌‌లు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దిల్ రాజు కూడా ‘మార్కండేయ’ యూనివర్స్ లేదంటే, ‘దిల్ రాజు సినిమాటిక్ యూనివర్స్’ (Dil Raju Cinematic Universe)ను క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా? అంటే.. తాజాగా ‘మార్కండేయ’ (Markandeya) టైటిల్ గ్లింప్స్‌ వేడుకకు హాజరైన ఎవరైనా అవుననే అంటారు. ఎందుకంటే, ఈ చిత్ర హీరో ఆ ప్రస్తావనను తీసుకొచ్చారు. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు (Dil Raju) దిల్ రాజు డ్రీమ్స్ అనే బ్యానర్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా యంగ్ హీరో విక్రాంత్‌తో ‘మార్కండేయ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్‌కు ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకమైనదనే విషయం టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు.

మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం

టైటిల్ గ్లింప్స్ వేడుకలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో మల్టీవెర్స్, సూపర్ హీరో మూవీస్ ఎన్నో ఉన్నాయి. కానీ మన పురాణాల్లో వేల ఏళ్ల నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు, చిరంజీవులు వంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇతిహాసాల నుంచి తీసుకున్న అలాంటి ఒక కథకు ఆధునిక రూపమే మా ‘మార్కండేయ’. ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేము చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీ కోసం ఒక యంగ్ టీమ్‌ను తీసుకుని అంతా రెడీ చేశాం. ఇలాంటి మూవీకి ఒక గైడెన్స్, సపోర్ట్ కావాలి. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్‌ను నిర్మాత దిల్ రాజు క్రియేట్ చేశారు. మేము మా కథ ఆయనకు చెప్పి, చేసిన కంటెంట్ చూపించాం. ఆయనకు నచ్చి మా సినిమాను దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండాలి, బడ్జెట్ కంట్రోల్ ఎలా చేయాలి, మూవీని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే విషయాల్లో మమ్మల్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. సీజీ ఎక్కువగా ఉండే చిత్రమిది. నెక్ట్స్ మరింత మంచి కంటెంట్‌ను మీ ముందుకు తీసుకొస్తాం.

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న దిల్ రాజు

మార్కండేయుడి పాత్రకు మోడరన్ వెర్షన్ ఈ మూవీ. మార్కండేయుడికి ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వస్తాయో అలాగే ఈ మార్కండేయుడికి వస్తాయి. ఆ పరమశివుడి దయతో ఆ సమస్యకు సమాధానాలు వెతికి ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ మూవీలో చూపించబోతున్నామని.. సాంకేతికత కంటే హ్యూమన్ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఇది సినిమాటిక్ యూనివర్స్ అనే అనిపిస్తుంది. అది ఏ విధంగా ముందుకు వెళుతుందనేది మాత్రం.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మొత్తంగా అయితే దిల్ రాజు కూడా తన యూనివర్స్‌ను క్రియేట్ చేసే పనిలో ఉన్నారనేది మాత్రం ఈ ‘మార్కండేయ’ సాక్షిగా అర్థమవుతోంది.

మొత్తానికి ‘మార్కండేయ’ చిత్రం ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను అందించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.