
ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి. దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కొత్త సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, వంశీ పైడిపల్లి ఎంపికపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Key Points
ఓజీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా వార్తల్లో ఉంది.
దిల్ రాజు నిర్మాణంలో పవన్ కొత్త చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.
గతంలో వంశీ పైడిపల్లి తీసిన 'వారసుడు' సినిమాపై ట్రోలింగ్ జరిగింది.
ఈ కాంబోపై ఫ్యాన్స్ నిరాశ చెంది, దర్శకుడిని మార్చాలని కోరుతున్నారు.
ఓజీ తర్వాత పవన్ నెక్స్ట్ మూవీ?
Pawan-Dil Raju: ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ అనే మాస్ కొటౌట్ కి పర్ఫెక్ట్ కంటెంట్ పడితే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఓజీ సినిమా చూపించింది. కేవలం రీజనల్ సినిమాగా రిలీజైన ఓజీ మొదటిరోజే ఏకంగా రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టి పవన్ స్టార్(Pawan-Dil Raju) స్టామినా ఏంటో చూపించింది. అయితే, ఓజీ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటారు అనుకున్నారు అంతా.
Rashmika-Sandeep: ఆ పాత్ర చేయనంటే చేయను.. రష్మిక సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్.. కారణం ఏంటో తెలుసా..
దిల్ రాజు ప్లానింగ్: డైరెక్టర్ వంశీ పైడిపల్లి!
కానీ, ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ కూడా చేయడానికి అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. అయితే, అంతకన్నా ముందే మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలిసి నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడిగాడట. మంచి కథ సెట్ అయితే తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి కథ, దర్శకుల వేటలో ఉన్న దిల్ రాజు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కు సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ కథను, దర్శకుడిని సెట్ చేశాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు వంశీ పైడిపల్లి.
వంశీ పైడిపల్లి వద్దంటున్న ఫ్యాన్స్!
మెసేజ్ ఓరియెంటెడ్ కథలతో సినిమాలు చేయడంలో ఈ దర్శకుడు దిట్ట. ఈ నేపథ్యంలోనే వంశీ చెప్పిన ఒక కథ దిల్ రాజుకి బాగా నచ్చిందట. ఆ కథకి పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఆ కథను పవన్ కళ్యాణ్ కి వినిపించి ప్రాజెక్టు లాక్ చేయించాలని భావిస్తున్నాడట. అయితే, పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుకి వంశీ పైడిపల్లిని డైరెక్టర్ గా ఫిక్స్ చేయడంపై ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కారణం ఏంటంటే, గతంలో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబోలో వారసుడు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల సమయంలో వంశీ పైడిపల్లిపై చాలా ట్రోలింగ్ జరిగింది. అది సినిమాలా కాదు సీరియల్ లా ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి దర్శకుడుతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే నెగిటీవ్ ఇంపాక్ట్ పడుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే దయచేసి డైరెక్టర్ ను మార్చండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంపై ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో దర్శకుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అభిమానుల విజ్ఞప్తిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


