|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరో ఐదు రోజుల్లో ఈ 5 రాశుల వారికి శుభం: సూర్య-కుజ ద్విద్వాదశ దృష్టి యోగం

Published: 18-09-2025, 10:21 AM
మరో ఐదు రోజుల్లో ఈ 5 రాశుల వారికి శుభం: సూర్య-కుజ ద్విద్వాదశ దృష్టి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 23న సూర్య, కుజుల ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందిస్తుంది.

Key Points

1

మేషం, సింహం, కర్కాటకం, కన్య, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు.

2

ఉద్యోగంలో ప్రమోషన్లు, కొత్త అవకాశాలు.

4

దూర ప్రయాణాలు, సానుకూల మార్పులు.

సూర్య-కుజుల సంయోగం: దాని ప్రభావం

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు, కుజుడు ద్విద్వాదశ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు, కుజుడు 30 డిగ్రీల వద్ద సెప్టెంబర్ 23న సంయోగం చెందుతున్నారు. దీంతో ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడనుంది. ఇది మేషరాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలను పొందనున్నారు. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఎవరికి ఏ విధంగా కలిసి వస్తుంది వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి వారికి సూర్య–కుజుల ద్విద్వాదశ దృష్టి యోగం శుభ ఫలితాలను తీసుకురానుంది. ఈ రాశి వారికి వారిపై వారికి నమ్మకం కలుగుతుంది. ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టుల కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం.

శుభ ఫలితాలను పొందే రాశులు

సింహ రాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ సమయంలో పెరుగుతుంది.

కర్కాటక రాశి వారికి యోగం శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.

కన్యా రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. కొత్త అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సంతోషంగా వుంటారు. సమస్యలు తీరుతాయి.

ఈ సమయంలో జాగ్రత్తలు

ధనుస్సు రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు చదువులో బాగా రాణిస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం. దూర ప్రయాణాలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సూర్య-కుజుల ద్విద్వాదశ దృష్టి యోగం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే, ఇది ఒక సూచన మాత్రమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.