|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ సినిమాతో ఈర్ష్య పడుతున్నారు! నాపై అసూయపడే వారికి మారుతి మాస్ వార్నింగ్!

Published: 01-01-2026, 11:00 PM
ప్రభాస్ సినిమాతో ఈర్ష్య పడుతున్నారు! నాపై అసూయపడే వారికి మారుతి మాస్ వార్నింగ్!
  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ది రాజాసాబ్’ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
  • ఇండస్ట్రీలో తన ఎదుగుదలను చూసి చాలామంది ఈసారి తాను ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారని మారుతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
  • ఈర్ష్య, అసూయ మానవ సహజ లక్షణాలని, తమకు అవకాశాలు దొరకవేమోనని భయపడేవారు అలా కోరుకుంటారని మారుతి పేర్కొన్నారు.
  • తన పతనం వాళ్లకు అన్నం పెట్టదని, ఈసారి తాను పడిపోవడం కాదు, వాళ్ల ఆలోచనలు పడగొడతానని మారుతి సవాల్ విసిరారు.

దర్శకుడు మారుతి తన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన ఫెయిల్యూర్‌ను కోరుకుంటున్నారని, వారికి దీటైన సమాధానం ఇస్తూ, ఈసారి వారిని పడేస్తానని సంచలన శపథం చేశారు.

‘ది రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు

మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ (the rajasaab) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad)ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మారుతి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా భావిస్తుండగా, షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టైటిల్, కాన్సెప్ట్ విషయంలో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దర్శకుడు మారుతి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. “ఇండస్ట్రీలో చాలామంది మీరు ఈసారి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారట.

ప్రభాస్‌తో సినిమా చేసే ఛాన్స్ రావడమే ఇందుకు కారణమా? లేక జెలసీ వల్లనా?” అని నేరుగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మారుతి చాలా ఓపెన్‌గా, కాస్త ఘాటుగానే స్పందించారు. ఇంకా మారుతి మాట్లాడుతూ..“ఎవరికైనా తమకు నచ్చినట్లు కోరుకునే హక్కు ఉంటుంది. దాన్ని మనం ఆపలేం. పక్కింటివాడు కొత్త కారు కొంటే అది యాక్సిడెంట్ అవ్వాలని కోరుకునే వాళ్లూ ఉంటారు. ఈర్ష్య, అసూయ అనేవి మానవ సహజ లక్షణాలే. నాకు మాత్రమే అవకాశాలు రావాలి, నన్నే అందరూ ప్రేమించాలి అనుకునే మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది” అని అన్నారు. అలాగే తను ఫెయిల్యూర్ అవ్వాలనుకుంటున్నారో చెప్తాడు. ‘‘వాడికి సక్సెస్ వస్తే మనకు దొరకడేమో, మన దగ్గరికి రాడేమో అన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. నేను చిన్న సినిమాల ఈవెంట్లకు ఇప్పటికీ వెళ్తుంటాను. కానీ నాకు పెద్ద సక్సెస్ వస్తే, పిలిస్తే వెళ్లనేమో అని వాళ్లకు అనిపిస్తుంటుంది. అందుకే ఈసారి వీడు పడిపోతే బాగుంటుంది అనుకుంటారు.

ఇండస్ట్రీలో నాపై అసూయ: మారుతికి యాంకర్ ప్రశ్న

ఒక మనిషి ఎదిగితే ఇగో పెరుగుతాడేమో, మనుషులను దూరం పెడతాడేమో అన్న అనుమానమే వాళ్ల ఆలోచనలకు కారణం” అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, “ఈసారి కథ చెప్పడానికి వస్తే దొరకడేమో అన్న భయంతోనే వాడికి ఓ దెబ్బ తగిలితే బాగుంటుందని లోపల ఒక ఉద్దేశం ఉండొచ్చు. కానీ నా ఫెయిల్యూర్ వాళ్లకు అన్నం పెట్టదు. నేను పడిపోతే వాళ్ల జీవితం మారిపోదు. అందుకే నేను పడిపోవాలని కాదు.. వాళ్ల ఆలోచనలే పడిపోవాలి అనుకుంటున్నాను. ఈసారి నేను కింద పడను.. వాళ్లను పడేయాలనుకుంటున్నా” అంటూ గట్టిగా స్పందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో ఆయనకు ఎవరి మీద అసహనం ఉందనే చర్చ మొదలైంది. అసలు మారుతితో విభేదాలు ఉన్నవారు ఎవరు? ఆయన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

నా ఫెయిల్యూర్ కోరేవారికి మారుతి గట్టి సమాధానం

ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

మొత్తంగా, మారుతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అంతర్గత ఈర్ష్య, అసూయపై మరోసారి చర్చకు తెరలేపాయి. ‘ది రాజాసాబ్’ విడుదల తర్వాత ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.