|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇట్స్ అఫీషియల్: అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్.. వీడియో వైరల్

Published: 07-06-2025, 2:43 AM
ఇట్స్ అఫీషియల్: అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్.. వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో నటించనున్నారని అధికారికంగా ప్రకటించారు.

Key Points

1

అల్లు అర్జున్ – అట్లీ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనున్నారు.

2

ఈ వార్తను అధికారికంగా ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేశారు.

4

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్ – అట్లీ సినిమా అప్డేట్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్– స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రానుందని మూవీ యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దీపికా పదుకొణె హీరోయిన్‌గా

ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా బన్నీ సరసన ఏ హీరోయిన్ నటించబోతుందో తెలియజేశారు మూవీ టీమ్. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బన్నీకి జోడీగా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన వీడియో

ఇక వీడియోలో.. అట్లీ దీపికా పదుకొణెకు సీన్స్ ఎక్స్‌ప్లేన్ చేస్తున్నాడు. ఇక స్టోరీ నచ్చి దీపిక చాలా బాగుంది అని చెప్పి అట్లీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి ఈ ముద్దుగుమ్మ కత్తి పట్టుకుని ఫైటింగ్ చేస్తున్నట్లు ప్రాక్టీస్ చేస్తుంది. సీరియస్‌ లుక్‌లో దీపికా భలే అనిపించింది. కత్తి పట్టుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ మహారాణి ఝాన్సీ లక్ష్మీ బాయిలా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సినిమాను మరో లెవెల్‌కి తీసుకుని వెళ్లే విధంగా ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

దీపికా పదుకొణె నటనతో ఈ చిత్రం మరింత ఆసక్తికరంగా మారింది. వీడియో వైరల్ కావడం చిత్రంపై అంచనాలను పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.