|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్‌ జాతర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. సినిమా హిట్‌ అవ్వడానికి ఎన్ని కోట్లు రావాలంటే?

Published: 01-11-2025, 9:30 AM
మాస్‌ జాతర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. సినిమా హిట్‌ అవ్వడానికి ఎన్ని కోట్లు రావాలంటే?

మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘మాస్‌ జాతర’ చిత్రం శుక్రవారం ప్రీమియర్స్ తో విడుదలైంది. తొలి రోజు మిశ్రమ స్పందన లభించినా, ప్రీమియర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లు వసూలు చేసింది. సినిమా హిట్‌ కావడానికి ఎన్ని కోట్లు రావాలో, ఫస్ట్ డే వసూళ్ల అంచనాలు ఈ కథనంలో చూడండి.

Key Points

1

`మాస్‌ జాతర` మూవీ ప్రీమియర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లు వసూలు చేసింది.

2

ఫస్ట్ డే కలెక్షన్లు రూ.5 కోట్ల లోపే ఉండవచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

4

`మాస్‌ జాతర` థియేట్రికల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సుమారు రూ.30 కోట్లు.

మాస్‌ జాతర ప్రీమియర్స్ కలెక్షన్లు

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన `మాస్‌ జాతర` మూవీ ఈ శనివారం నుంచి రెగ్యూలర్‌ షోస్‌తో రన్‌ అవుతుంది. ఈ మూవీ శుక్రవారం సాయంత్రం షోలతో విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారమే ఈ మూవీ రిలీజ్‌ కావాల్సి ఉండగా, `బాహుబలి ది ఎపిక్‌` కోసం ఒక్క రోజు గ్యాప్‌ ఇచ్చారు. అయితే సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీంతో వీటికి మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది. కలెక్షన్ల పరంగానూ ఇది సత్తా చాటింది.

తాజాగా `మాస్‌ జాతర` మూవీ ప్రీమియర్స్ కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసిందట. ప్రీమియర్స్ ద్వారానే ఇంత వసూళ్లని సాధించడం విశేషంగా చెప్పొచ్చు. ఇక శనివారం కలెక్షన్లు ఈ మూవీకి కీలకంగా మారబోతున్నాయి. శుక్రవారం ప్రీమియర్స్ తో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీ అంటున్నారు. ఆ టాక్‌ ప్రభావం సినిమా వసూళ్లపై పడే అవకాశం ఉంది. దీంతో ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఫస్ట్ డే వసూళ్ల అంచనా

అయితే ప్రీమియర్స్ కి వచ్చిన టాక్‌ ఫస్ట్ డే బుకింగ్స్ పై ప్రభావం పడటంతో మొదటి రోజు వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఐదు కోట్ల లోపే ఉండే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఈ మూవీ ప్రీమియర్స్, డే 1 కలెక్షన్లు కలిపి రూ.8-10కోట్ల లోపు ఎక్స్ పెక్ట్ చేయోచ్చు. మరి ఆ మాత్రం అయినా చేస్తుందా? లేదా అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి సుమారు రూ.30కోట్ల థియేట్రికల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఇందులో నైజాంలో పది కోట్లు, ఆంధ్రాలో రూ.11.5కోట్లు, సీడెడ్‌లో రూ.3.5కోట్లకు థియేటర్ హక్కులు అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌లో రూ.3కోట్లు, రెస్ట్ ఆఫ్‌ ఇండియా మరో రూ.2 కోట్లకి అమ్ముడయ్యిందట. ఇలా రూ.30కోట్ల వరకు థియేటర్‌ బిజినెస్‌ అయ్యిందని సమాచారం. ఈ లెక్కన సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.60కోట్ల గ్రాస్‌ రావాలి. మరి అది సాధ్యమేనా అనేది డౌట్‌.

సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే..

రవితేజ హీరోగా నటించిన `మాస్‌ జాతర` మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. నూతన దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు. సుమారు రూ.90కోట్ల బడ్జెట్‌తో మూవీని రూపొందించినట్టు సమాచారం. భీమ్స్ సంగీతం అందించగా, ఇందులో రాజేంద్రప్రసాద్‌, సముద్రఖని, మురళీ శర్మ, హైపర్‌ ఆది, రచ్చ రవి, ఇమ్మాన్యుయెల్‌, నరేష్‌, అజయ్‌ ఘోష్‌, వీటీవీ గణేష్‌ కీలక పాత్రలు పోషించారు. నవీన్‌ చంద్ర విలన్‌ పాత్రలో నటించారు. మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. కామెడీ కొంత వరకు వర్కౌట్‌ అయ్యింది. యాక్షన్‌ సీన్లు మెప్పించాయి. రాజేంద్రప్రసాద్‌ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇందులో వింటేజ్‌ రవితేజని చూపించారు. కానీ రొటీన్‌ కమర్షియల్‌ మూవీ అనే టాక్‌ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది.

`మాస్‌ జాతర` రూ.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ కోసం రూ.60 కోట్ల గ్రాస్ సాధించాలి. తొలి రోజు వసూళ్లపై టాక్ ప్రభావం చూపినా, రాబోయే రోజుల్లో చిత్రం ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.