|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మెలోడి సాంగ్‌.. ‘హుడియో హుడియో’ విడుద‌ల

Published: 08-10-2025, 3:45 AM
Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మెలోడి సాంగ్‌.. ‘హుడియో హుడియో’ విడుద‌ల

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హుడియో హుడియో’ మెలోడీ సాంగ్ తాజాగా విడుదలైంది. భాను భోగవరపు దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది.

Key Points

1

రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి 'హుడియో హుడియో' అనే మూడో మెలోడి సాంగ్ విడుదలైంది.

2

భా‌ను భోగ‌వ‌ర‌పు దర్శకత్వంలో, శ్రీలీల కథానాయికగా ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది.

4

భీమ్స్ సిసిరోలియో సంగీతం, దేవ్ సాహిత్యం అందించగా హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ ఈ పాటను ఆలపించారు.

రవితేజ ‘మాస్ జాతర’ చిత్ర విశేషాలు

Mass Jathara : మాస్ మహారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం మాస్ జాత‌ర‌. భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 31 ఈ చిత్రం (Mass Jathara) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

అందులో భాగంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌లు ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది.

‘హుడియో హుడియో’ పాట విడుదల, టీం వివరాలు

Kannada stars : లక్కీ హీరోయిన్స్ గా కన్నడ స్టార్స్

సంగీత, సాహిత్య అందించిన కళాకారులు

తాజాగా మూడో పాట‌ను ‘హుడియో హుడియో’ అనే మెలోడీని విడుద‌ల చేశారు. భీమ్స్ సిసిరోలియో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. దేవ్ సాహిత్యాన్ని అందించ‌గా హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ క‌లిసి ఈ పాట‌ను పాడారు.

‘హుడియో హుడియో’ పాట విడుదల ‘మాస్ జాతర’ ప్రచారంలో కీలక ఘట్టం. భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ మెలోడీ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.