|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఊటీలో ఆ హీరోకి హోటల్‌… వెళ్లాలంటే భయపడేదాన్ని : మీనా

Published: 08-11-2025, 10:07 AM
ఊటీలో ఆ హీరోకి హోటల్‌... వెళ్లాలంటే భయపడేదాన్ని : మీనా

దక్షిణాది స్టార్ హీరోయిన్ మీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ కెరీర్, మిథున్ చక్రవర్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డేట్స్ లేకపోయినా మిథున్ తనతో సినిమా చేయమని తరచు అడిగేవాడని, ఆయన హోటల్‌కు వెళ్లాలంటే భయపడేదాన్నని ఆమె వెల్లడించారు.

Key Points

1

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీనా ఒకప్పుడు ఒకేరోజు మూడు, నాలుగు షూటింగ్స్‌లో పాల్గొనేది.

2

వరుస దక్షిణాది సినిమాలతో బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించిన మీనా, టైం లేదని వివరించింది.

4

ఆయనకు నో చెప్పలేక, ఊటీలోని మిథున్ చక్రవర్తి హోటల్‌కు వెళ్లాలంటేనే మీనా భయపడేది.

బాలీవుడ్ అవకాశాలు తిరస్కరించడానికి కారణం

ఒకప్పుడు సౌత్ ‌ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు . చైల్డ్ ‌ ఆర్టిస్ట్ ‌ గా కెరీర్ ‌ ని ప్రారంభించి , ఆ తర్వాత హీరోయిన్ ‌ గా దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది . తెలుగులో అప్పటి స్టార్ ‌ హీరోలందరితోనూ సినిమాను చేసింది . తమిళ , కన్నడలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ‌ ఉండేది . ఒకనొక దశలో ఒకే రోజు మూడు , నాలుగు సినిమాల షూటింగ్ ‌ లకు హాజరయ్యేదట . ఇలా తెలుగు , కన్నడ , తమిళ , మలయాళంలో పలు సినిమాలు చేసిన మీనా(Meena) .. హిందీలో మాత్రం పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ చేసింది . ఆ తర్వాత అవకాశాలు వచ్చినా .. తాను చేయలేదట . ఓ స్టార్ ‌ హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా .. చేయలేకపోయానని .. ఒకనొక దశలో ఆయన ఉన్న హోటల్ ‌ కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది మీనా . తాజాగా ఓ యూట్యూబ్ ‌ చానల్ ‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హీరో గురించి , తాను ఎందుకు బాలీవుడ్ ‌ సినిమాలు చేయలేకపోయిందో వివరించింది .

మిథున్ చక్రవర్తి అడిగేవాడు: మీనా

తినడానికి కూడా టైం లేదు .. తెలుగుతో పాటు తమిళ్ ‌, కన్నడ , మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను . అదే సమయంలో నాకు బాలీవుడ్ ‌ ఆఫర్స్ ‌ కూడా వచ్చాయి . కానీ చేయలేకపోయాను . ఇక్కడే నాకు తినడానికి , నిద్రపోవడానికి కూడా టైమ్ ‌ దొరకలేదు . ఇక బాలీవుడ్ ‌ సినిమాలు ఎలా చేస్తా . పైగా అక్కడ టైమ్ ‌ కి షూటింగ్ ‌ పూర్తి కాదని చెప్పారు . బాలీవుడ్ ‌ లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్ ‌ లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు . అందుకే నేను బాలీవుడ్ ‌ పై ఫోకస్ ‌ చేయలేదు . పర్దా హై పర్దా తర్వాత ఆఫర్స్ ‌ వచ్చినా తిరస్కరించా .

ఊటీ హోటల్ వెళ్లాలంటే భయం

మిథున్ చక్రవర్తి అలా అడిగేవాడు అప్పట్లో బాలీవుడ్ ‌ హీరో మిథున్ ‌ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ‌ ఉండేది . సినిమా షూటింగ్స్ ‌ అన్నీ అక్కడే జరిగేవి . నా సినిమా షూటింగ్ ‌ కోసం అక్కడి వెళ్తే .. అదే హోటల్ ‌ లో ఉండేదాన్ని . అప్పుడు మిథున్ ‌ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ ..‘ నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్ ‌’ అని అడిగేవాడు . నాకు చేయాలనే ఉండేది .. కానీ డేట్స్ ‌ ఖాలీగా ఉండేవి కాదు . నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు . నాకేమో డేట్స్ ‌ ఖాలీగా ఉండేవి కాదు . ఒకానొక దశలో ఆ హీరో హోటల్ ‌ కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని . అంత పెద్ద స్టార్ ‌ హీరోకి నో చెప్పలేక బాధపడేదాన్ని . ఎప్పుడైనా ఊటీకి వెళితే .. ఆ హోటల్ ‌ వద్దు .. వేరే హోటల్ ‌ లో రూమ్ ‌ బుక్ ‌ చేయమని అడిగేదాన్ని . ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేంది ’ అని మీనా చెప్పుకొచ్చింది .

మీనా తన కెరీర్‌లో దక్షిణాది సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. బాలీవుడ్ అవకాశాలను త్యాగం చేసిన ఆమె, మిథున్ చక్రవర్తితో ఉన్న అనుభవాన్ని వివరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.