|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు…హీరోయిన్ మీనాక్షి బోల్డ్ కామెంట్స్ !

Published: 10-11-2025, 10:38 PM
70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు...హీరోయిన్ మీనాక్షి బోల్డ్ కామెంట్స్ !

నటి మీనాక్షి చౌదరి తన భవిష్యత్ చిత్రాల గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. కథ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తానని, 70 ఏళ్ల హీరోలతోనూ నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. అయితే, తల్లి పాత్రలు మాత్రం అంగీకరించబోనని మీనాక్షి వెల్లడించింది.

Key Points

1

మీనాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుప‌రాదు'తో తెలుగు తెర‌కు పరిచయం.

2

రవితేజ, మహేష్ బాబు వంటి పెద్ద హీరోల సరసన నటించారు.

4

70 ఏళ్ల హీరోలతో నటించేందుకు ఓకే, కానీ తల్లి పాత్రలు చేయనని స్పష్టం.

మీనాక్షి చౌదరి సినీ ప్రస్థానం

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ, కొంతమంది దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) ఒకరు. ఇచ్చట వాహనములు నిలుప‌రాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ళ సుందరి మీనాక్షి, ఆ తర్వాత రవితేజ, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సరసన నటించింది. ఇక మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బంపర్ హిట్ అందుకుంది ఈ అందాల తార.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలో న‌టిస్తోంది. భ‌విష్య‌త్తులో సినిమాలు చేయ‌డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మీనాక్షి చౌదరి. ఎలాంటి సినిమాలు అయినా కథ నచ్చితే, తాను చేస్తానని వెల్లడించింది. సీనియర్ హీరోలు అయినా సరే, వాళ్ల సరసన నటిస్తానని పేర్కొంది. కానీ, పిల్లల తల్లిగా కనిపించే పాత్ర వస్తే, మాత్రం రిజెక్ట్ చేస్తానని వెల్లడించింది. లక్కీ భాస్కర్ ( Lucky Baskhar ) సినిమా సమయంలో అనివార్య కారణాలవల్ల తల్లి పాత్ర పోషించాలని స్పష్టం చేసింది. ఇకపై తల్లి పాత్ర పోషించబోనని వివరించింది. కానీ 70 ఏళ్ళు ఉన్న హీరో సరసన ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానని హింట్ ఇచ్చారు.

భవిష్యత్ చిత్రాలపై మీనాక్షి బోల్డ్ వ్యాఖ్యలు

తల్లి పాత్రలపై నటి స్పందన

మీనాక్షి చౌదరి తన కెరీర్‌పై స్పష్టమైన అభిప్రాయాలతో ఉంది. వయసుతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూనే, కొన్ని రకాల పాత్రలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఇది ఆమెకు మరిన్ని అవకాశాలు తెస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.