
📌 Key Points
- మీనాక్షి చౌదరి కాబోయే భర్తకు 100 ఎకరాల పొలం ఉండాలని కోరారు.
- వంట చేయడం, బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులన్నీ అతనే చూసుకోవాలన్నారు.
- మీనాక్షి కోరికలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
- త్వరలో నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ సినిమాలో మీనాక్షి నటించనున్నారు.
మీనాక్షి చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అతనికి 100 ఎకరాల పొలం ఉండాలని, ఇంటి పనులన్నీ చూసుకోవాలని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
కాబోయే భర్త గురించి మీనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు
Meenakshi Chowdary: మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఇతర సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మీనాక్షి చౌదరి కాబోయే భర్త గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చేసుకోబోయే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే అంశం గురించి ప్రస్తావనకు వచ్చింది.
ఈ విషయం గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి పెద్ద లిస్టు బయట పెట్టిందని చెప్పాలి. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తను చేసుకోబోయే వ్యక్తికి కచ్చితంగా 100 ఎకరాల పొలం ఉండాలని తెలిపారు. అలాగే ఆయనకు వంట చేయటం, బట్టలు ఉతకడం, వాటిని ఐరన్ పెట్టడం కూడా రావాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటి బాధ్యతలు అన్నీ కూడా అతనే చూసుకోవాలి అంటూ ఈమె కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల విభిన్న స్పందనలు
ఇలా మీనాక్షి చౌదరి లిస్టు మొత్తం బయట పెట్టడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మీకు భర్త కావాలా లేక పని వాడు కావాలా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి కామెంట్స్ ద్వారా సోషల్ మీడియాలో ఫామ్ లో ఉండటం కోసమే మీనాక్షి చౌదరి ఇలా మాట్లాడారు అంటూ ఈమె వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఏది ఏమైనా భర్త విషయంలో మీనాక్షి చౌదరి కోరికలు మామూలుగా లేవని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే…
పురావస్తు శాఖ శాస్త్రవేత్తగా..
సినిమాలతో బిజీగా మీనాక్షి చౌదరి
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకుంటున్నారు. ఇక ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వృషకర్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో విడుదల కాబోతోందని సమాచారం. ఇందులో దక్ష అనే పాత్రలో పురావస్తు శాఖ సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో కూడా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి మీనాక్షి చౌదరి తన భర్త విషయంలో పెట్టిన కండిషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరలో వృషకర్మ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.


