|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరా రాజ్ సంచలనం: స్టార్ హీరోయిన్ దిశగా పరుగులు.. భారీ ఆఫర్లతో అదరగొడుతున్న నార్త్ బ్యూటీ!

Published: 21-12-2025, 7:44 AM
మీరా రాజ్ సంచలనం: స్టార్ హీరోయిన్ దిశగా పరుగులు.. భారీ ఆఫర్లతో అదరగొడుతున్న నార్త్ బ్యూటీ!
  • చూడ‌చ‌క్క‌ని రూపం, చ‌లాకీద‌నంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న మీరా రాజ్.
  • ‘స‌న్ ఆఫ్’ చిత్రంలో మీరా రాజ్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది.
  • పూజా హెగ్డే, రాఘ‌వ లారెన్స్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాంచ‌న 4’ లో మీరా రాజ్ కు కీలక అవకాశం.
  • పాత్ర కోసం తమిళ భాషను నేర్చుకుంటూ మీరా రాజ్ తన ప్రొఫెషనలిజానికి నిదర్శనంగా నిలిచింది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటి మీరా రాజ్ సంచలనం సృష్టిస్తోంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ‘సన్ ఆఫ్’ చిత్రంలో మెరిసింది. ఇప్పుడు ‘కాంచన 4’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె అంకితభావం, కష్టపడే తత్వంతో స్టార్ హీరోయిన్ దిశగా అడుగులు వేస్తోంది.

మీరా రాజ్: టాలీవుడ్ లో కొత్త అందం

Meera Raj: చూడ‌చ‌క్క‌ని రూపం.. గుండె కోసే వలపు సోయగం.. స్క్రీనంతా తళుక్కుమంటూ చెలరేగిపోయే చ‌లాకీద‌నం.. ఇవ‌న్నీటికి రూపం ఇస్తే అదే హీరోయిన్ మీరా రాజ్(Meera Raj). నార్త్ నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మీరా రాజ్. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామ‌ర్ ఆండ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మీరా. ఈ అమ్మడు నటించిన లేటెస్ట్‌ తెలుగు మూవీ ‘స‌న్ ఆఫ్’. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్ వ‌స్తోంది.

Bigg Boss 9 Telugu: ఇమ్మాన్యుయేలే విన్నర్.. చాలా డిజప్పాయింట్ అయ్యా.. జబర్దస్త్ రోహిణి షాకింగ్ పోస్ట్

కాంచన 4 ఆఫర్: లారెన్స్ పై మీరా కృతజ్ఞత

ఈ మూవీలో మీరా చేసిన త‌న పాత్రకు ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా త‌ర్వాత కూడా మీరా రాజ్ కెరీర్ స్పీడ్‌గా మారుతోంది. తాజాగా ఆమెకు దక్కిన క్రేజీ ప్రాజెక్ట్ కాంచ‌న 4. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘ‌వ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డైరెక్ట‌ర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది. రీసెంట్ గా ఈ ఆఫర్ గురించి మాట్లాడిన ఆమె.. “నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

స్టార్ హీరోయిన్ గా మీరా రాజ్ ప్రయాణం

ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా కోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఈ నాలుగు లక్షణాల సమ్మేళనమే మీరా రాజ్. సౌత్‌ సినిమాల్లోకి ఉత్తరాది అమ్మాయిగా వచ్చి, “మన అమ్మాయే” అనిపించేలా నటించగలగడం అంత సులువు కాదు. కానీ మీరా రాజ్ త‌న‌కు అది సాధ్యమ‌ని నిరూపిస్తోంది. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీకి మరో రైజింగ్ స్టార్‌గా వ‌చ్చేసిన‌ట్టే అంటున్నారు ఫ్యాన్స్.

మీరా రాజ్ అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఆమెను సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక “రైజింగ్ స్టార్” గా నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.